home page

ఏపి ఆర్ధిక శాఖ కార్యదర్శికి నాన్-బెయిలబుల్ వారెంట్

విద్యా శాఖకు అక్షింతలు 

 | 
కోర్టుకు గైర్హాజరు!!
ఆర్థిక శాఖ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్
***
తరచూ హైకోర్టుతో చీవాట్లు తింటూ వస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులకు తాజాగా మరో మొట్టికాయ తగిలింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననుంచి ఎస్పీలు, కలెక్టర్లు, చివరికి డిజిపి కూడా కోర్టు చేతిలో చీవాట్లు తింటున్నారు. కొందరు అధికారులకు జరిమానాలు, శ్రీలక్ష్మి వంటి సీనియర్లకు అయితే సామాజిక సేవ చేయడం వంటి శిక్షలూ పడ్డాయి. ఇదే క్రమంలో నేను ఆర్థిక శాఖ కార్యదర్శికి నాన్ బెయిలబుల్ వారెంట్ ను కోర్టు జారీచేసింది. కోర్టు విచారణకు గైర్హాజరు అయినందుకు కోర్టు తీవ్రంగా పరిగణించి వారెంట్ ఇచ్చింది.
రైల్వే ఏకవుంట్స్ సర్వీస్ కు చెందిన సత్యనారాయణ డిప్యుటేషన్ మీద
 ఆంధ్రప్రదేశ్ ఆర్ధిక శాఖ కార్యదర్శి గా పని చేస్తున్నారు. విద్యాశాఖకు చెందిన పనులు చేసిన తమ బిల్లులు ఎప్పటికీ ప్రభుత్వం చెల్లించడం లేదని పలువురు కాంట్రాక్టర్లు కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో కేసును విచారణకు శ్వీకరించిన కోర్టు గత విచారణ సమయంలో సంబంధిత
 అధికారులు రావాలని హైకోర్టు ఆదేశించింది. 
12న జరిగిన ఈ విచారణకు ఆర్ధిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ విద్యాశాఖ కార్యదర్శి సురేష్కుమార్ హాజరయ్యారు. కాగా సత్యనారాయణ గైర్హాజరయ్యారు.
అధికారులు అందరూ రావాలన్న తమ ఆదేశాన్ని ధిక్కరించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణిస్తూ సత్యనారాయణ కు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవనంద్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఇకనైనా ఆయన కోర్టుకు వస్తారో లేదో చూడాలి..