home page

ఐదు గ్రామాలు విలీనం చేయండి

గ్రామసభలలో తీర్మానాలు 

 | 
 Vv mnvv
తెలంగాణలో విలీనం చేయండి!
ఆంధ్రప్రదేశ్‌లోని ఐదు గ్రామాల తీర్మానం.
గోదావరి భారీగా వరద రావడం.. భద్రాచలంలో చాలా కాలనీలు నీట మునగడంతో పోలవరం ముంపుపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే భద్రాచలంను అనుకుని ఉన్న ఐదు గ్రామాల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
గోదావరి భారీగా వరద రావడం.. భద్రాచలంలో చాలా కాలనీలు నీట మునగడంతో పోలవరం ముంపుపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రాచలానికి అనుకుని ఉన్న ఐదు గ్రామ పంచాయితీలకు తెలంగాణకు ఇవ్వాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. పోలవరంతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని చెప్పారు. భద్రాచలం ముంపుకు గురికాకుండా ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాల్సిన అవసరం ఉందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ముంపు నుంచి రక్షించడానికి కరకట్ట నిర్మించడానికి వీలవుతుందని చెప్పారు. అయితే అలాంటి డిమాండ్ సరైనది కాదని.. పోలవరంతో భద్రాచలానికి ఎలాంటి ముంపు ఉండబోదని ఏపీ మంత్రులు బదులిచ్చారు.
అయితే తాజాగా భద్రాచలానికి అనుకుని ఉన్న ఐదు గ్రామాలు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆ ఐదు గ్రామాలు.. తెలంగాణలో కలపాలని కోరుతూ తీర్మానాలు చేశాయి. పంచాయితీలో చర్చించుకున్న తర్వాత ఆ గ్రామాలు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ జాబితాలో ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామాలు ఉన్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాల మధ్య.. ఈ ఐదు గ్రామాల వివాదం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత.. పోలవరం ముంపు మండలాల పేరుతో అప్పటి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ కలిపిన సంగతి తెలిసిందే. ఈ ఐదు గ్రామాలు కూడా అందులో ఉన్నాయి.