home page

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ: మెట్టుకూరు

 | 
mettukuri

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ తధ్యం..

మృదు స్వభావి ప్రజలతో మంచి సంబంధాలు కలిగి తన సొంతంగా ఏర్పాటు చేసిన ట్రస్టు ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజాభిమానం సంపాదించి రాజకీయంలో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్న ఆత్మకురు నియోజకవర్గం వాసి మాజీ డిసిసి చైర్మన్ మెట్టుకూరు ధనుంజయ రెడ్డి  వచ్చే ఎన్నికల్లో తాను ఎమ్మెల్యే గా పోటీకు సిద్ధమంటూ స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో  పర్యటించిన సందర్భంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాను కచ్చితంగా పోటీ చేస్తున్నట్లు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి   స్పష్టమైన ప్రకటన చేశారు.. అనంతసాగరం మండలంలో , ఆత్మకూరు పట్టణంలో దేవాలయాల నిర్మాణం కోసం ఆయన సొంత నిధులు ఇచ్చే క్రమంలో ఆత్మకూరు పట్టణం జేఆర్ పేట ప్రాంతంలోని వినాయక దేవాలయ మండపానికి తన సొంత నిధులు అందచేసేందుకు వచ్చి ఇక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ మాటలు స్పష్టం చేశారు.. జే ఆర్ పేట లోని వినాయక దేవాలయ మండపానికి అక్కడి నిర్వాహకులకు 2,50,000 చెక్కును అందజేసిన అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను పుట్టినిల్లుగా ఆత్మకురు నియోజవర్గము ,అత్తవారిల్లుగా వెంకటగిరి నియోజకవర్గంలో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ,అత్యధిక ప్రజాభిమానం ఉండి అభిమానులు అనునిత్యం పోటీపై స్పష్టత కోరుతూ ఉన్న సమయం కోసం వేచి ఉన్నానని ధనుంజయ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రస్తుతం శాసనసభకు పోటీ చేసేందుకు అనుకూలత వాతావరణం ఉండడంతో వచ్చే ఎన్నికల్లో తాను తప్పనిసరిగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు.. కానీ ఎక్కడ నుండి పోటీ చేస్తారో అనే విషయం వెల్లడించలేదు..ధనుంజయ రెడ్డి  సమావేశానికి ఆత్మకురు మున్సిపాలిటీ పరిధిలోని 8 మంది కౌన్సిలర్లు హాజరు కావడం విశేషం..