home page

బ్యాంకు డబ్బుతో క్యాషియర్ క్రికెట్ బెట్టింగ్: పరారీలో నిందితుడు

బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి 22 లక్షలు ఎత్తు కెళ్ళి క్రికెట్ బెట్టింగ్: మేనేజర్ కు మెసేజ్

 | 
Bank fraud

వనస్థలిపురం బ్రాంచ్ మేనేజర్ ఫిర్యాదు

బెట్టింగ్ కోసం బ్యాంకు డబ్బు- క్యాషియర్ నిర్వాకం

హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రాంచీ నుండి రూ. 22 లక్షలు తీసుకెళ్లిన క్యాషియర్ ప్రవీణ్ కుమర్ కేసులో కొత్త కోణాలు వెలుగు చూశాయి.

 క్రికెట్ బెట్టింగ్ లో బ్యాంకు నుండి తీసుకెళ్లిన డబ్బులను క్యాషియర్ ప్రవీణ్ పెట్టుబడిగా పెట్టినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు వస్తే తాను తిరిగి వస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకొంటానని ప్రవీణ్ కుమార్ బ్యాంకు మేనేజర్ కు మేసేజ్ పెట్టాడు.ఈ మేసేజ్ ను బ్యాంకు మేనేజర్ పోలీసులకు అందించాడు. క్రికెట్ బెట్టింగ్ లో తాను డబ్బులు నష్టపోయినట్టుగా కూడా ఆ మేసేజ్ లో ప్రవీణ్ కుమార్ వివరించారు.ఈ మేసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకు ఆఫ్ బరోడా వనస్థలిపురం బ్రాంచీలో ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి క్యాషియర్ గా పనిచేస్తున్నాడు.ఈ నెల 10వ తేదీన యధావిధిగా విదులకు హాజరయ్యాడు. సాయంత్రం నాలుగు గంటలకు తనకు కడుపులో నొప్పిగా ఉందని బ్యాంకు మేనేజర్ కు చెప్పాడు. మెడికల్ షాపులో టాబ్లెట్ తీసుకుని వస్తానని చెప్పి ప్రవీణ్ కుమార్ బ్యాంకు నుండి వెళ్లిపోయాడు. బ్యాంకు ముగిసే సమయమైనా కూడా ప్రవీణ్ కుమార్ బ్యాంకుకు రాలేదు. ప్రవీణ్ కుమార్ కు బ్యాంకు సిబ్బంది ఫోన్ చేశారు. అయితే ఆయన ఫోన్ స్విచ్ఛాప్ వచ్చింది. అనుమానం వచ్చి ప్రవీణ్ కుమార్ క్యాబిన్ చెక్ చేస్తే రూ. 22 లక్షలు మాయమైనట్టుగా బ్యాంకు సిబ్బంది గుర్తించారు.

వెంటనే బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రవీణ్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ప్రవీణ్ కుమార్ బ్యాంకు మేనేజర్ కు మేసేజ్ పెట్టాడు. క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు వస్తే తాను తిరిగి బ్యాంకు కు వస్తానని లేకపోతే ఆత్మహత్య చేసుకొంటానని ఆ మేసేజ్ లో పేర్కొన్నాడు.

ఈ మేసేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రవీణ్ కుమార్ ఉపయోగించిన సెల్ పోన్ ఆధారంగా అతను ఎక్కడ ఉన్నాడనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. నాలుగు పోలీసు బృందాలు ప్రవీణ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.