home page

84 గ్రామాల పరిధిలో మరో హైదరాబాద్ అభివృద్ధి తధ్యం

జోవో 111 రద్దు ఫలితం!       రియల్ డెవెలప్మెంట్ ఖాయం!

 | 
New Hyderabad

ఎకరం వంద కోట్ల పైమాటే అంటున్న రియల్టర్లు

84 గ్రామాలలో రియల్ డెవెలప్ మెంట్ గ్యారంటీ

హైదరాబాద్‌ శివారు ప్రాంతాల దశ మారనుంది. జీవో నెంబరు 111 ఎత్తి వేసినందు వల్ల రంగారెడ్డి, వికారాబాద్‌ జిల్లాల భూములు బంగారుమయం కానున్నాయి. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ పరిధిలోని 84 గ్రామాల్లో జీవో 111 ఆంక్షలను ఎత్తివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రాంతం అభివృద్ధికి కీలకం కానున్నది.

గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో 111జీవో కారణంగా భారీ నిర్మాణాలు సాధ్యం కాలేదు. ఇప్పుడు జీవో రద్దు తర్వాత పరిస్ధితుల్లో మార్పులు తప్పేలా లేవు.
ఎకరం వంద కోట్ల పైమాటే! 1.32 లక్షల ఎకరాల్లో అభివృద్ధికి అవకాశం ఉంది. హైదరాబాద్ విస్తీర్ణం కన్నా 84 గ్రామాలలో స్థిరపడ్డవారి సంఖ్య ఎక్కువ. పైగా ఈ ప్రాంత విస్తీర్ణం 580 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ కొన్ని భవనాల నిర్మాణం చేపడితే మొత్తం ప్రాంతం మారిపోతుంది. మరో కొత్త హైదరాబాద్ ఏర్పడుతుంది.