శ్రీనివాసరావు ప్లాట్ లో ఇద్దరు అమ్మాయిలు...దాడికి ముందు మాయం!?

శ్రీనివాసరావు ప్లాట్ లో ఇద్దరు అమ్మాయిలు…దాడికి ముందు మాయం!?

గత వారంలో వైకాపా అధినేత వైఎస్ జగన్ పై కత్తితో దాడికి పాల్పడిన శ్రీనివాసరావు గురించి విచారించిన పోలీసులు, మరో ఆసక్తికర విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. ఎయిర్ పోర్టుకు కేవలం కిలోమీటరు దూరంలోనే ఉన్న ఓ ప్లాట్ లో శ్రీనివాసరావు, అతని స్నేహితుడు రాజు, మరో యువకుడు, ఇద్దరు యువతులు ఉండేవారని తెలుస్తోంది. వీరందరూ ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ ఫుల్స్ లోనే పని చేస్తున్నారు. ఇక, జగన్ పై దాడికి కొద్ది రోజుల ముందు ఈ ఇద్దరు అమ్మాయిలూ వెళ్లిపోగా, గ్వాలియర్ నుంచి నరేష్‌ కుష్వా, భరత్‌ సింగ్‌ అనే ఇద్దరు కుక్ లు వచ్చారు.

వీరిద్దరూ గతంలో అదే రెస్టారెంట్ లో పని చేసి గ్వాలియర్ కు వెళ్లిపోగా, వారిని అధిక వేతనంపై తిరిగి వెనక్కు పిలిపించినట్టు తెలుస్తోంది. వీరు వచ్చేసరికి కనిపించకుండా పోయిన అమ్మాయిలు ఎవరు? వారు ఎక్కడికి వెళ్లారన్న విషయాలపై మరింత స్పష్టత రావాల్సివుంది. వీరిద్దరి దుస్తులూ ఇంకా శ్రీనివాసరావు ఉన్న ప్లాట్ లోనే ఉండటం గమనార్హం. కాగా, నిన్న జగన్ పై దాడి కేసును దర్యాఫ్తు చేస్తున్న సిట్ బృందం, ఈ ప్లాట్ కు వెళ్లి ఇద్దరు కుక్ లను విచారించింది. శ్రీనివాస్ గురించి తమకేమీ తెలియదని, ఐదు రోజుల క్రితమే వచ్చామని వెల్లడించినట్టు తెలుస్తోంది.
Tags: ys jagan mohan reddy, attack, srinivas rao,vizag airport