1 TMC మరియు 1 క్యూసెక్ అంటే ఏమిటి ?

1 TMC మరియు 1 క్యూసెక్ అంటే ఏమిటి ? ఈ యునిట్లను ఎలా సులభంగా అర్థం చేసుకోవచ్చు.

1 TMC మరియు 1 Cusec అంటే ఏమిటి ? ఈ యునిట్లను తరచుగా న్యూస్ పేపర్ లో చూస్తూవుంటాం . ఈ మధ్యనే న్యూస్ లో వచ్చినది ఏమంటే గోదావరినుండి 1.5 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రం పాలు చేశామని.
*1 TMC = one thousand million cubic feet*
= 28,316,846,592
liters of water

*1 Cusec = cubic feet per second*
= 28.317 liters of water per second

చాలా మందికి ఈ అంకెలనుండి ఎంత నీరు వేస్టు అయిందో సరైన అవగాహన కల్గదు.
కాని ఈ అంకెలను మనకు తెలిసిన లేదా మన ఊహకు అందే విషయాలతో పోల్చడం వల్ల , చాలా సులభంగా ఎంత నీరు వేస్టు అయిందో అవగాహన కల్గుతుంది.
ఒక టిఎంసి జలం అంటే దాదాపు 15 రోజులపాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న)ఉపయోగించే నీల్ల తో సమానం ·
నాగార్జున సాగర్ డ్యామ్ కెపాసిటి 400 టిఎమ్ సిలు అంటే దాదాపు 17 సంవత్సరాలు హైదరాబాద్ నగరానికి (70 లక్షల జనాభా వున్న) సరిపోయెంత నీరు అని అర్థం ·
ఒక లక్ష క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే నాలుగు న్నర నెలల పాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న ) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అనుకోవచ్చు.
22000 క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే = ఒక నెల పాటు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న ) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అనుకోవచ్చు.
700 క్యూసెక్ జలం ఒక రోజంతా సముద్రం లోకి వదిలారంటే = ఒక రోజు హైదరాబాద్ నగరం (70 లక్షల జనాభా వున్న ) ఉపయోగించే నీరు ఒక్క రోజులో సముద్రం పాలు అయిందని అనుకోవచ్చు.