tirumala rooms, latest room prices

‘తిరుమల అద్దె గదుల ధరల పెంపు’

తిరుమలలో అద్దె గదుల ధరలు పెరిగాయి. పెరిగిన ధరలన్నింటినీ ఈ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం అమల్లోకి తెచ్చింది. నందకం అద్దె గదుల ధరలు ఇప్పటివరకు రూ.600గా ఉండేవి.. ఇప్పుడు రూ.1000కి పెరిగాయి. కౌస్తుభం, పాంచజన్యంలో అద్దె గదుల ధరలు రూ.500 నుంచి రూ.1000కి పెరిగాయి. వేంకటేశ్వరుడి భక్తులకోసం తిరుమలలో రూ.50 నుంచి రూ.3000 వరకు వసతి సదుపాయం ఉంది. రూ.100, రూ.500, రూ.600కు లభించే గదులను సాధారణ వసతి కింద లెక్కిస్తారు. అలాగే, రూ.999, రూ.1500తో లభించే గదుల్లో ఏసీ సదుపాయం ఉంటుంది.

సామాన్యులు ఎక్కువగా రూ.100కి వచ్చే వసతి గదుల్లో ఉంటారు. ఆ గదులు దొరకకపోతే  రూ.500, రూ.600 చెల్లించి సాధారణ వసతి గదుల్లో ఉంటారు. కాగా, తిరుమలలో వసతి గదుల ధరలను పెంచినప్పటికీ తిరుపతిలో మాత్రం పెంచలేదు. రూ.100, రూ.200, రూ.300, రూ.400,  రూ.600,  రూ.800, రూ.1000కు లభ్యమయ్యే వసతి గదులను ఎప్పటిలాగే భక్తులు పొందవచ్చు.