టీఆర్ఎస్ లో గెలిచిన 119 మందిలో 67 మంది నేరచరితులే!

ఇక టీఆర్‌ఎస్‌ పంచాయితీలపై గురి

బీసీ కార్పొరేషన్‌ రుణాల కోసం విద్యావంతులైన నిరుద్యోగులు ఏండ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సుమారు 12 లక్షల మంది రుణాల కోసం బీసీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేసుకుంటే గత నాలుగున్నర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హాయాం టలో కేవలం 1.13లక్షల మందికి మాత్రమే రుణాలు అందజేశారు. మిగతా వారిని కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడం తప్పా ఎవరికీ రుణాలు ఇవ్వలేదు. కనీసం ఈ కొత్త ప్రభుత్వంలోనైనా అర్హులైన బీసీలందరికీ రుణాలు అందజేయాలని నిరుద్యోగులు కోరుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులందరికీ రుణాలు అందించేందుకు ఎస్సీ కార్పొరేషన్‌ అధికారులు కసరత్తు మొదలు పెట్టారు. ఈ నెలాఖరులోపు గతంలో ఎంపికైన వారందరికీ సబ్సిడీ రుణాలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

దాంతో సుమారు 40వేల మంది లబ్దిదారులకు రుణాలు అందే అవకాశం ఉంది.జనవరిలో జరుగనున్న పంచాయతీ ఎన్నికలకు టిఆర్‌ఎస్ శ్రేణులు సిద్ధం కావాలని నిర్ణయించినట్లు తెలిపారు డిసెంబర్ 26 నుంచి జనవరి 6 వరకు పది రోజుల పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఓటర్ల నమోదుపై దృష్టి సారించాలని, అర్హులందరి పేర్లనూ ఓటర్ల జాబితాలో చేర్చేలా పనిచేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఉత్సాహంతో గెలిచామో పంచాయతీ ఎన్నికల్లోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగించాలనిపేర్కొన్నారు. ప్రభుత్వ నిధులు గ్రామాలకు ఉపయోగపడేలా కృషి చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. పంచాయతీ ఎన్నికల్లో వీలైనంతవరకు ఏకగ్రీవ ఎన్నిక జరిగేలా చూడాలని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నిక జరగడం ద్వారా ఆ గ్రామానికి రూ.10 లక్షల నిధులు వస్తాయని, ఆ నిధులను గ్రామాభివృద్దికి ఉపయోగించుకోవచ్చని చెప్పారు. పంచాయతీ ఎన్నికల తర్వాత ఫిబ్రవరిలో సభ్యత్వ నమో దు చేపట్టనున్నట్లు తెలిపారు. మార్చి నుంచి పార్లమెంట్‌లో ఎన్నికల్లో గెలుపే లక్షంగా కార్యకర్తలందరూ పనిచేయాలని అన్నారు.

రాష్ట్రంలో 16 పార్లమెంట్ స్థానాలు గెలిచేలా పనిచేయాలని పేర్కొన్నారు. పార్టీ కమిటీలో వివిధ హోదాలలో ఉన్న ఐదుగురు ఎంఎల్‌ఎలుగా గెలుపొందిన నేపథ్యంలో తమ నియోజకవర్గ అభివృద్దిపై దృష్టి పెట్టాల్సి ఉన్నందున కార్యవర్గం నుంచి తమను తప్పించాలని స్వఛ్చందంగా కోరారని అన్నారు. టిఆర్‌ఎస్ బిసి సెల్ అధ్యక్షుడిగా ఉన్న ముఠా గోపాల్, ఎస్‌సి సెల్ అధ్యక్షుడు సుంఖె రవిశంకర్, ప్రధాన కార్యదర్శి మైనంపల్లి హన్మంతరావు, కార్యదర్శులు పట్నం నరేందర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌లు స్వఛ్చందంగా పార్టీ కార్యవర్గం నుంచి తప్పుకున్నారని, త్వరలో ఆ ఖాళీలను భర్తీ చేస్తామని పేర్కొన్నారు. వాటితోపాటు కార్యవర్గంలోని మిగతా ఖాళీలను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. త్వరలో జిల్లాలవారీగా కెటిఆర్ పర్యటనలు ఉంటాయన్నారు.ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ భవన్‌లో త్వరలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలని పార్టీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించి సంబంధిత ఎంఎల్‌ఎకు లేదా సంబంధిత అధికారులకు బదిలీ చేసి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తామని తెలిపారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హైదరాబాద్‌లో ఉంటే ప్రతి రోజు 2-3 గంటలపాటు తెలంగాణ భవన్‌లో కార్యకర్తలకు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు.
Tags: TRS party, aim on , panchayath elections, bc corporation, sc corporation