T congress leader dhasoju sravan sensational comments on trs party

ఆంధ్ర కాంట్రాక్టర్ల బూట్లు నాకుతున్నారు: టీఆర్ఎస్ పై కాంగ్రెస్ నేత శ్రావణ్ ఫైర్

టీఆర్ఎస్ పై టీకాంగ్రెస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్ నిప్పులు చెరిగారు. టీఆర్ఎస్ నేతలు ఆంధ్ర కాంట్రాక్టర్ల బూట్లు నాకుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. మీకు ఆంధ్రకు చెందిన కాంట్రాక్టర్ మేఘా కృష్ణారెడ్డి కావాలి కానీ… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దా? అని ప్రశ్నించారు. హెలికాప్టర్ లో అమరావతికి వెళ్లినప్పుడు తెలంగాణ తాకట్టు గుర్తుకు రాలేదా? అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు బదులుగా ఆయన ఈ మేరకు స్పందించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎందుకు గద్దె దించాలన్న ప్రశ్నకు ప్రతి పక్షాల వద్ద సమాధానమే లేదన్న కేటీఆర్ వ్యాఖ్యలకు సమాధానంగా…. ఇదే ప్రశ్నను రాష్ట్రంలోని మేధావులు, జర్నలిస్టులు, రైతులు, నిరుద్యోగులు, ముస్లింలను అడిగితే ఎందుకు గద్దె దింపాలో చెబుతారని అన్నారు. ప్రాజెక్టుల్లో చోటు చేసుకుంటున్న భారీ అవినీతిపై కోర్టుకు వెళ్లడం కూడా నేరమేనా? అని మండిపడ్డారు.
Tags: T congress leader, dhasoju sravan, sensational ,comments,trs party,andhra contracts