surya,aparna balamurali,aakashame nee haddura movie

‘ఆకాశం నీ హద్దురా’ నుంచి సాంగ్ ప్రోమో

  • సూర్య తాజా చిత్రంగా ‘సూరరై పొట్రు’
  • తెలుగు టైటిల్ గా ‘ఆకాశం నీ హద్దురా’
  • కథానాయికగా అపర్ణ బాలమురళి

తెలుగు .. తమిళ భాషల్లో సూర్యకి మంచి క్రేజ్ వుంది. అందువలన తమిళంతో పాటు తెలుగులోను ఆయన సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. సుధ కొంగర దర్శకత్వంలో ఆయన తాజా చిత్రంగా తమిళంలో ‘సూరరై పొట్రు’ రూపొందింది. తెలుగులో ఈ సినిమాకి ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాంగ్ ప్రోమోను విడుదల చేశారు. ‘పిల్లా పులి ..’ అంటూ ఈ పాట మొదలవుతోంది. ‘ఎరవేశావే సంకురాతిరి సోకుల సంపదని .. నరికేశావే నా రాతిరి నిద్దరని’ అంటూ సాగుతోంది. ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, కథానాయికగా అపర్ణ బాలమురళి అలరించనుంది. పైలెట్ జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Tags: surya,aparna balamurali,aakashame nee haddura movie