Subramanian Swamy says

టీటీడీకి విముక్తి కల్పించండి

  • ప్రభుత్వ అజమాయిషీ వద్దు
  • హైకోర్టులో సుబ్రమణ్య స్వామి పిటిషన్‌
  • కేసును తానే వాదిస్తానని వెల్లడి
హైదరాబాద్‌: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్య స్వామితోపాటు న్యాయశాఖ విద్యార్థి సత్యపాల్‌ స భర్యాల్‌లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చే శారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తిరుచానూరు పద్మావతి ఆలయంతోపాటు మరో 11 ఇతర ఆలయాలను విముక్తి చే యాలని కోరారు. రాజ్యాంగంలోని 14, 25, 26 అధికరణాలకు విరుద్ధంగా ఉన్న దేవదాయ చట్టంలోని అనేక సెక్షన్ల ను రద్దు చేయాలన్నారు. నిధులు, ఆస్తులు, ఆభరణాల వినియోగంపై 6 నెలల్లో సమగ్ర విచారణ పూర్తిచేసేలా దేవదాయ శాఖతోపాటు టీటీడీ ఈవోను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేయాలని కోరారు.
Tags: Subramanian Swamy,TTD devasthanam,property