spandhana programme in ap state

స్పందనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

• అమరావతి: స్పందనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష

• స్పందన ద్వారా అందే వినతుల పరిష్కారంలో నాణ్యతకోసం అధికారులకు వర్క్‌షాపులు: సీఎం

• దీనిపై కార్యాచరణ ప్రణాళిక తయారుచేశాం : సీఎం

• ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లకు వర్క్‌షాపు: సీఎం

• మనం సమస్యలు తీరుస్తామన్న ఆశతో ప్రజలు మన దగ్గరకు వస్తారు: సీఎం

• వినతులు ఇచ్చేవారి స్థానంలో మనం ఉంటే.. ఎలా ఆలోచిస్తామో.. అదే రీతిలో మనం స్పందించాల్సి ఉంటుంది: సీఎం

• అప్పుడే స్పందనకు ఆర్థం ఉంటుంది: సీఎం

• ఎమ్మార్వోలు, ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు మరింత మానవీయ దృక్పథంతో వినతులకు పరిష్కారం చూపాలి: సీఎం

• దీనికోసమే ఈ వర్క్‌ షాపులు : సీఎం

• రాష్ట్ర స్థాయిలో చీఫ్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈనెల 24, 27 తేదీల్లో వర్క్‌ షాపు.

• అక్టోబరులో జిల్లాల స్థాయిలో రెండురోజులపాటు వర్క్‌ షాపులు : సీఎం

• దిగువస్థాయి అధికారులకు మరింత మోటివేషన్‌ పెంచడమే దీని ఉద్దేశం: సీఎం

• కలెక్టర్లు కూడా ఈ వర్క్‌ షాపులో పాల్గొనాలి: సీఎం

• నవంబర్‌ నెల నుంచి స్పందన వినతుల విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుంది: సీఎం

• గ్రామ సెక్రటేరియట్లను అక్టోబరు 2 నుంచి ప్రారంభిస్తున్నాం: సీఎం

• గ్రామ సచివాలయాల్లో సోషల్‌ ఆడిట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి: సీఎం

• కొత్త రేషన్‌కార్డులు, పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబరు నుంచి ఇవ్వాలి : సీఎం

• అక్టోబరు, నవంబరు నెలల్లో సామాజిక తనిఖీలు పూర్తిచేయాలి: సీఎం

• గ్రామ, వార్డు సెక్రటేరియట్‌ అందుబాటులోకి రాగానే అక్కడే డిస్‌ప్లే ఉండాలి: సీఎం

• రేషన్‌కార్డులు, పెన్షన్లు ఉన్నవారి జాబితాను బోర్డులో పెట్టాలి: సీఎం

• ఇళ్లపట్టాలకు సంబంధించిన లబ్ధిదారుల జాబితా కూడా పెట్టే ప్రయత్నంచేయాలి: సీఎం

• ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పెట్టాలి:

• ఈ జాబితామీద ఏమైనా అభ్యంతరాలు ఉన్నా, పథకం ఎవ్వరికీ అందకపోయినా ఆ సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించాలి: సీఎం

• అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందాలి: సీఎం

• వారికి అందించాల్సిన ధర్మం, బాధ్యత మనదే: సీఎం

సొంతంగా ఆటో, ట్యాక్సీ, మాక్సీ కాబ్‌లు నడుపుకుంటున్నవారికి ఏడాదికి రూ.10వేల పథకంపై రివ్యూ:

• దరఖాస్తులు తీసుకోవడం, వాటికి తనిఖీలు, ఆమోదంపై సీఎం సమీక్ష

• ఉగాది నాటికి పేదలందరికీ ఇళ్లస్థలాల పంపిణీపై సీఎం సమీక్ష

• లబ్ధిదారుల ఎంపిక, వెరిఫికేషన్‌ వేగవంతం చేయాలని సీఎం ఆదేశం

• సెప్టెంబరు ఆఖరు నాటికి డేటా కలెక్షన్, వెరిఫికేషన్‌ పూర్తికావాలన్న సీఎం

• అక్టోబరు చివరి నాటికి అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమి ఎంతో తేల్చాలన్న సీఎం

• నవంబర్‌ నుంచి అవసరమైన చోట భూముల కొనుగోలు ప్రక్రియ ప్రారంభంకావాలన్న సీఎం

• ఈ కార్యక్రమం మీద అధికారులు దృష్టిపెట్టాలన్న సీఎం

• వైయస్సార్‌ కంటి వెలుగు కింద 5.3 కోట్లమంది ప్రజలకు కంటి పరీక్షలు: సీఎం

• ఆరు విడతలుగా కార్యక్రమం: సీఎం

• మూడేళ్ల కాలంలో మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికీ కంటికి సంబంధించిన వైద్యం అందేలా చర్యలు : సీఎం

• అక్టోబరు 10నుంచి 16 వరకూ తొలిదశ

• అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లోని 70 లక్షల మందికి పైగా విద్యార్థులకు కంటిపరీక్షలు : సీఎం

• రెండో విడత కార్యక్రమం నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 31 వరకూ: సీఎం

• 3,4,5,6 విడతలు ఫిబ్రవరి 1 , 2020 నుంచి : సీఎం

• పిల్లలకు అయిపోయిన తర్వాత మిగిలిన ప్రజలకు అందరికీ పరీక్షలు, చికిత్సలు దశలవారీగా అందిస్తాం: సీఎం

• జిల్లాల్లో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఏర్పాటు: సీఎం

• పటిష్టంగా ఈ కార్యక్రమం అమలు కావాలి: సీఎం

• కంటి వెలుగు కార్యక్రమంకోసం చేసిన ఏర్పాట్లను సమీక్షించిన సీఎం

• ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించామన్న అధికారులు

• మొదటి స్క్రీనింగ్‌లో చికిత్స అవసరమున్న విద్యార్థులను గుర్తించి ఆమేరకు వారికి తదుపరి చికిత్స అందిస్తామన్న అధికారులు

• రూ.560 కోట్లతో కంటి వెలుగు కార్యక్రమం

• స్క్రీనింగ్, కంటి అద్దాల పంపిణీ, క్యాటరాక్ట్‌ శస్త్రచికిత్స, ఇతర కార్యక్రమాలన్నీ వైయస్సార్‌ కంటి వెలుగు కింద చేపట్టనున్న ప్రభుత్వం

పౌష్టికాహార లోపం, రక్తహీనతను అధిగమించడంపై సీఎం సమీక్ష :

• గ్రామ వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, అంగన్‌వాడీ కేంద్రాలను సమర్థవంతంగా వినియోగించుకోగలిగితే ఈసమస్యను అధిగమించవచ్చన్న విశ్వాసం నాకు ఉంది: సీఎం

• పౌష్టికాహార లోపంతో పిల్లలు, తల్లులు, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఇతర వర్గాల్లోని పేదరికంతో ఉన్న మహిళలను ఆ సమస్యనుంచి గట్టెక్కించాలి: సీఎం

• ప్రభుత్వం ఇంతగా ఖర్చుచేస్తున్నా… పౌష్టికాహార లోపం ఎందుకు వస్తోందన్న సీఎం

• అవసరమైతే మరింత ఖర్చు చేద్దాం, కాని సమస్యలు తీరాలి: సీఎం

• వాలంటీర్లు ప్రతి ఇంటినీ సర్వేచేసి, పిల్లలను, తల్లులను, మహిళలను అంగన్‌వాడీ కేంద్రాల దగ్గరకు వెళ్లేలా మోటివేట్‌ చేయండి: సీఎం

• అక్కడ వారికి పరీక్షలు నిర్వహించండి: సీఎం

• పౌష్టికాహారలోపం, ఎనీమియా పరీక్షలు నిర్వహించండి: సీఎం

• పరీక్షలు నిర్వహించిన తర్వాత వారి ఆరోగ్య కార్డులో పొందుపరిచి ఎప్పటికప్పుడు మానిటర్‌ చేయాలి: సీఎం

• మానిటరింగ్‌ బాధ్యత కూడా వాలంటీర్లకు అప్పగించాలి: సీఎం

• అంగన్‌వాడీల ద్వారా ఏమేమి ఇవ్వబోతున్నామో వాలంటీర్లకు సమాచారం ఇచ్చి, ఆమేరకు అవన్నీ కూడా పిల్లలకు, తల్లులకు అందేలా చూడాల్సిన బాధ్యత ఉంది: సీఎం

• పారిశుద్ధ్యం, ఆహారం, తాగునీటిపైనా ప్రజలకు అవగాహన కల్పించాలి: సీఎం

• వచ్చే సమీక్షా సమావేశానికి దీనిపై ఏం చర్యలు తీసుకున్నారన్నదానిపై నివేదించాలని సీఎం ఆదేశం

• పౌష్టికాహారలోపం, రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రూ.43 లు రోజుకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: సీఎం

• అలాగే పౌష్టికాహార లోపం, రక్తహీనతతో బాధపడుతున్న చిన్నారులకు రూ.18లు రోజుకు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాం: సీఎం

రాయలసీమ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలపై సీఎం సమీక్ష:

• కర్నూలు, కడప, ప్రకాశం తదితర ప్రాంతాల్లో భారీ వర్షాల సమాచారం వస్తోంది: సీఎం

• అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశం

• అనంతపురంలో చిరుధాన్యాల విత్తనాలను పంపిణీ చేస్తున్నామని చెప్పిన అనంతపురం కలెక్టర్‌

• వచ్చే ఏడాదినాటికి రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తిస్థాయిలో నింపేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలన్న సీఎం

• 117 టీఎంసీల నీరు వెళ్లినా రిజర్వాయర్లు నిండలేదంటే.. కాల్వల పరిస్ధితి ఎలా ఉందో అర్థమవుతుందోన్న సీఎం

• వరదజలాలు సద్వినియోగం చేసుకునే దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం

ఇసుక కొరతపై కలెక్టర్లతో సీఎం సమీక్ష:

• వర్షాలు, వరదల కారణంగా ఇసుక అందుబాటులోకి రాలేదన్న అధికారులు

• గోదావరి, కృష్ణా నదుల్లో ఇంకా ప్రవాహాలు ఉన్నాయన్న అధికారులు

• వరద తగ్గిన వెంటనే రీచ్‌లు అందుబాటులోకి వస్తాయన్న అధికారులు

• వరద తగ్గగానే వీలైనంత ఇసుకను స్టాక్‌యార్డుల్లోకి తరలించడానికి ముమ్మర ప్రయత్నాలు చేయాలని సీఎం ఆదేశం

• కౌలు రైతులకు సంబంధించి రైతు భరోసా మార్గదర్శకాలపై గ్రామ సచివాలయ ఉద్యోగికి, వాలంటీర్లకు పూర్తిస్థాయి అవగాహన ఉండాలన్న సీఎం-దానికి సంబంధించిన పత్రాలపై వారికి అవగాహన కల్పించాలన్న సీఎం

• దరఖాస్తు పత్రాలు, ప్రొఫార్మాలు అన్నీకూడా అక్టోబరు 2 నాటికి అందుబాటులో ఉంచాలన్న సీఎం

• లబ్ధిదారుల ఎంపిక కూడా పూర్తిచేయాలని సీఎం ఆదేశం