RRR నుంచి లేటెస్ట్ న్యూస్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు ప్రధాన పాత్రధారులుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం RRR. బాహుబలి తర్వాత మళ్ళీ భారీ అంచనాలతో భారతదేశంలోనే మరో మోస్ట్ అవైటెడ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది.అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా కొన్ని విషయాలు బయటకు వచ్చాయి.ఈ సినిమా అసలు టైటిల్ ను చిత్ర నిర్మాణ సంస్థ ఐనటువంటి డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు త్వరలోనే విడుదల చేయనున్నారని,తర్వాత మళ్ళీ షెడ్యూల్ మహారాష్ట్రలోని ఒక నెల పాటు జరుగుతుంది అని తెలుస్తుంది.అంతే కాకుండా ఇదే షెడ్యూల్ లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ కూడా చేరనున్నారట.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతా రామరాజు ఎన్టీఆర్ కొమరం భీం పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.