rasmika mandanna

హీరోయిన్ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు..

Share This
  • ఐటీ దాడులు రష్మికపై కాదు
  • ఆమె తండ్రి వ్యాపారాలకు సంబంధించి జరుగుతున్నాయి
  • రష్మిక లావాదేవీలన్నీ హైదరాబాదులో ఉన్నాయి

సినీ హీరోయిన్ రష్మిక ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయనే వార్త సంచలనంగా మారింది. కర్ణాటకలోని కొడగు సమీపంలోని విరాజ్ పేటలో ఉన్న ఆమె ఇంటితో పాటు, బెంగళూరులోని నివాసం, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఉదయం 7 గంటల సమయంలో ఈ సోదాలు మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలో ఆమె మేనేజర్ స్పందించారు. రష్మికపై ఐటీ దాడులు జరుగుతున్నాయనే వార్తలను ఆయన ఖండించారు. రష్మిక అకౌంట్లు, లావాదేవీలన్నీ హైదరాబాదులోనే ఉన్నాయని చెప్పారు. రష్మిక తండ్రి మదన్ మందన్న వ్యాపారాలకు సంబంధించి మాత్రమే సోదాలు జరిగాయని తెలిపారు. ఇటీవలి కాలంలో సినీ ప్రముఖులను ఐటీ అధికారులు టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Leave a Reply