చిరంజీవి సినీ జీవితానికి ‘పునాది’ వేసిన దర్శకుడు ఇక లేరు

  • మెగాస్టార్‌ తొలిచిత్రం డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ కన్నుమూత
  • పునాదిరాళ్లు సినిమాలో చిరుకు అవకాశం ఇచ్చిన రాజ్‌
  • గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో సతమతం

రాజ్‌కుమార్‌ అనారోగ్యంతో సతమతమవుతున్నారని తెలుసుకున్న చిరంజీవి ఇటీవల అపోలో ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కూడా చేయించారు. ఆర్థిక సాయం అందించారు. రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించిన తొలి సినిమా పునాదిరాళ్లు. ఈ సినిమాలో ఓ పాత్రకోసం చిరంజీవిని ఆయన ఎంపిక చేశారు. ఆ విధంగా  చిరింజీవి ఆశల శిఖరానికి పునాది రాయి వేశారు.

ఆ కృతజ్ఞతతోనే చిరంజీవి ఆయనకు చివరి రోజుల్లో సాయపడ్డారు. తొలి సినిమానే అయినా తన దర్శక ప్రతిభతో రాజ్‌కుమార్‌ ఐదు నంది అవార్డులు అందుకున్నారు. రాజ్‌కుమార్‌ స్వస్థలం కృష్ణా జిల్లా ఉయ్యూరు. ఆయన భౌతిక కాయాన్ని స్వగ్రామానికి తరలించి అక్కడ అంత్యక్రియలు నిర్వహించాలని చిన్నకొడుకు నిర్ణయించారు.