private travels,festival season, hike fare rates,diwakar travels

మళ్లీ పడగ విప్పిన ట్రావెల్స్ మాఫియా

ట్రావెల్స్ మాఫీయా మరో సారి ప్రజలను దోచుకునేందుకు రెఢీ అయింది. అడ్డగోలు దోపిడికి సిద్దమయింది. ఆర్టీసి చేతులెత్తేయడంతో, ప్రవేట్ ట్రావెల్ యాజమాన్యాలు సిండికేట్ గా మారిపోయాయి. ఇష్టారాజ్యంగా రేట్లు పెంచేసి, నిలువుదోపిడి పై ప్రత్యేక కథనం….. ప్రైవేట్ ట్రావెల్స్ మరో సారి దోపిడికి తెగబడ్డాయి. సంక్రాంతి పండగకు ముందే ప్రయాణికులను నిలువుదోపిడి చేస్తున్నాయి. వైజాగ్,విజయవాడ,చెన్నై,బెంగుళూరు,కరింనగర్, రాజమెండ్రి, కాకినాడ,తిరుపతి ఇలా అనేక ప్రాంతాలకు వెళ్లేందుకు రెడీ అయ్యారు. అయితే ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు కుమ్మక్కై పోయాయి. ఏపి ఆర్టీసి, టిఎస్ ఆర్టీసి టిక్కెట్లు ఆన్ లైన్ లో బుక్కపోవడం స్పెషల్ సర్వీసులు ఏమి ఏర్పాటు చేయక పోవడంతో, ప్రయాణికులు ప్రైవేట్ బస్సులు ఎక్కేందుకు సిద్దమయ్యారు. అయితే ప్రైవేటు బస్సు యాజమాన్యాలు సిండికేట్ గా మారిపోయి టిక్కెట్ రేట్లు మూడు రెట్లు అమాంతం పెంచేశాయి.
ప్రదేశం ఏపిఆర్టీసి టిఎస్ ఆర్టీసి ప్రైవేట్ ట్రావెల్స్…..
విజయవాడ…………. 350రూ నాన్ ఏసి, 480ఏసి 600 నార్మల్ డే 1800 ప్రస్తుతం
వైజాగ్…… 650రూ నాన్ ఏసీ, 900ఏసీ 750 నార్మల్ డే 2100 ప్రస్తుతం
కరీంనగర్ ఇలా ఏ ఒక్క ప్రాంతమని కాదు, అన్ని రూట్లలో బస్సు రేట్లను పెంచేశారు. ఇక అభీ బస్, రెడ్ బస్స్, వంటి యాప్ లలో కూడా పెంచిన రేట్లు దర్జాగా ఉంచి మరి టిక్కెట్లు అమ్మెస్తున్నారు. ధనుంజయ ట్రావెల్స్, ఎస్ వి ఎస్, దివాకర్ ట్రావెల్స్, కావేరి ట్రావెల్స్, సాయి క్రిష్ణా ట్రావెల్స్, మార్నింగ్ స్టార్, బి ఎస్ ఆర్, ఎస్ వి కేటి, శ్రీ అట్లూరి, ప్రియాంకా, రెడ్డీ ఎక్స్ ప్రెస్, ఇలా వందల సంఖ్యలో ట్రావెల్స్ మాఫీయా బస్సు రేట్లను పెంచి యాదేచ్చగా దోపిడికి సిద్దమయింది.. ప్రైవేట్ ట్రావెల్స్ పై ప్రభుత్వం కొరడా జులిపించాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఆర్టీఏ అధికారులతో ఈ యాజమాన్యాలు కుమ్మక్కై ప్రయాణికుల జేబులు గుల్ల చేస్తున్నాయిని, దీని పై వెంటనే చర్యలు తీసుకోవాలని భాదితులు కోరుతున్నారు.
Tags: private travels,festival season, hike fare rates,diwakar travels