police vs tdp mp jc diwakar reddy in anantapur

‘నాలుక కోస్తా’ అన్న పోలీసు వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న జేసీ!

నేడు ప్రత్యేక మీడియా సమావేశం
ఆహ్వానాలు పంపిన జేసీ
గట్టి సమాధానం ఇస్తారంటున్న జేసీ వర్గీయులు

తమపై తీవ్ర విమర్శలు చేసిన అనంతపురం ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డిపై స్పందిస్తూ, పోలీసులు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపగా, వాటిని తాను సీరియస్ గా తీసుకుంటున్నట్టు జేసీ తెలిపారు. ‘మమ్మల్ని కించపరిస్తే, నాలుక కోస్తాం’ అని పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించడాన్ని తప్పుబడుతున్న ఆయన, నేడు ప్రత్యేకంగా మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నానని తెలిపారు.

ఈ మేరకు మీడియాకు ఆహ్వానాలు పంపారు. పోలీసు అధికారులు వారి వ్యాఖ్యల ద్వారా హద్దుమీరారని, వారికి గట్టి సమాధానాన్ని తమ నేత నేడు ఇస్తారని జేసీ వర్గీయులు అంటున్నారు. కాగా, నేటి మీడియా సమావేశంలో ప్రబోధానంద ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలపై తన వద్ద ఉన్న సాక్ష్యాలు చూపుతూ, పోలీసుల తీరును ఆయన ఎండగడతారని తెలుస్తోంది.
Tags: police, mp jc diwakar reddy, media meeting,naluka kostham