Police, Jagan, Andhra Pradesh, cm convoy

సీఎం వెళ్లే ముందు ఖాళీ కాన్వాయ్ ను పంపిన పోలీసులు

  • ముగిసిన ఏపీ మంత్రి వర్గ సమావేశం
  • జగన్ వెళ్లే మార్గంలో పోలీసుల మోహరింపు
  • కాసేపట్లో తాడేపల్లిలోని తన నివాసానికి జగన్
  • రేపు ఉదయం విశాఖపట్నంకు  

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేతృత్వంలో కొనసాగిన ఏపీ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. సచివాలయంలో కేబినెట్ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ ను ‘రాజధాని’ ఆందోళనకారులు అడ్డుకోకుండా పోలీసులు చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన వెళ్లే సమయంలోనూ ఇదే రీతిలో చర్యలు తీసుకున్నారు.

జగన్ వెళ్లే మార్గంలో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం వెళ్లే ముందు పోలీసులు ఖాళీ కాన్వాయ్ ను పంపారు. కాసేపట్లో జగన్ తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకోనున్నారు. కాగా, రేపు ఉదయం అక్కడి నుంచి జగన్ విశాఖపట్నం వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా పోలీసులు ఏర్పాట్లు చేశారు.

Tags: Police, Jagan, Andhra Pradesh, cm convoy