ntr trivikram srinivas movie, aravindha sametha, rrr movie

త్రివిక్రమ్ తో ఎన్టీఆర్ సినిమా బడ్జెట్ 200 కోట్లు?

ప్రస్తుతం ఎన్టీఆర్ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమా షూటింగులో బిజీగా వున్నాడు. మరో వైపున బన్నీ సినిమా పనులతో త్రివిక్రమ్ తీరికలేకుండా వున్నాడు. జనవరిలో త్రివిక్రమ్ ఫ్రీ అయితే, ఫిబ్రవరికి ఎన్టీఆర్ ఫ్రీ అవుతాడు. ఆ తరువాత ఈ ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమవుతోంది.

ఇంతకుముందు ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అరవింద సమేత’ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఈ సారి చేయనున్న సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఉండేలా త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు. ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ అమాంతంగా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లనుందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ సినిమాతో ఆయన మార్కెట్ పరిధి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అందువల్లనే ఆ స్థాయిలో అందరికీ కనెక్ట్ అయ్యే కంటెంట్ ను త్రివిక్రమ్ సిధ్ధం చేయనున్నాడట. త్రివిక్రమ్ తన మార్క్ నుంచి బయటికి వచ్చి చేసే ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.
Tags: ntr trivikram srinivas movie, aravindha sametha, rrr movie