విశ్వసనీయతకు పంచె కడితే అది వైఎస్సార్

  • విశ్వసనీయతకు పంచె కడితే వైఎస్సార్ ఆకారమవుతుంది.
  • ఫీజ్ రీ ఇంబర్స్మెంట్ అనగానే గురుతొచ్చేది వైయస్సార్.
  • 108 కుయ్ కుయ్ అనగానే జ్ఞప్తికి వచ్చేది వైయస్సార్.
  • ప్రాజెక్టులు అనగానే తలపుకొచ్చేది వైఎస్సార్.
  • రైతు రుణమాఫీ అన్న
    ఉచిత విద్యుత్ అన్నా
  • పావలా వడ్డీ అన్నా.. మదిలోకొచ్చే పేరు వైఎస్సార్.

నాటి ప్రధాని మన్మోహన్ నిర్ణయాన్ని ధిక్కరిస్తూ 50 రూపాయల గ్యాస్ రాయితీని భరించే సాహసం వైయస్సార్ కు తప్ప మరెవరికి ఉంటుంది? సోనియాకు ఆగ్రహం వస్తుందని తెలిసి కూడా పేద మహిళల కోసం సాహసించాడు. అందుకే ఆయన పేదవాడి గుండె సవ్వడి అయ్యారు.

చెప్పినవే కాక చెప్పని వరాలను కూడా ఉక్కుసంకల్పంతో అమలు చేసిన మొనగాడు వైఎస్సార్ కాక ఇంకెవరున్నారు ఈ లోకంలో?2004 – 2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో స్వర్ణయుగం. గుప్తుల కాలం స్వర్ణయుగం అని చరిత్రలో చదివాము. వైయస్సార్ పాలనలో మళ్లీ దాన్ని చూసాము. ఆయన ఖ్యాతిని ఓర్వలేని క్షుద్ర కీటకాలు ఆయన్ని అవినీతిపరుడుగా బురద చల్లవచ్చు. కానీ ఆయన నిన్నూ నన్నూ ఎవరినీ దోచుకోలేదు.

ప్రజారంజకుడు అన్నా
పాలనా దురంధరుడు అన్నా
మంత్రాంగంలో యుగంధరుడు అన్నా
అది ఒక్క వైఎస్సార్ కు మాత్రమే చెల్లుతుంది

ఆయన కాకిలా కలకాలం జీవించలేదు.
రాయంచలా అల్పకాలమే జీవించాడు.
అయితే ఏం?

కాకి ఆయుసు నూరేళ్లే.
వైయస్సార్ ఖ్యాతి వెయ్యేళ్లు ప్రభలు చిమ్ముతుంది.

వైయస్సార్ చిరంజీవి. ఆయన భౌతికంగా మనమధ్య లేకపోవచ్చు. కానీ, ఆయన ఆత్మ ప్రతి పేదవాడి చుట్టూనే తిరుగుతుంది. ఆయన కీర్తి మరణం లేని మార్కండేయుడు.

(వైయస్సార్ వర్ధంతి )