Kanna, Guntur, BJP Meeting, Gurajala

ఏపీ బీజేపీ చీఫ్ కన్నా అరెస్ట్!

  • గురజాల వెళ్లేందుకే నిర్ణయించుకున్న కన్నా
  • గుంటూరు శివార్లలోనే అడ్డుకున్న పోలీసులు
  • అదుపులోకి తీసుకుని తిరిగి నగరంలోకి

తాను గురజాలకు వెళ్లి తీరుతానని భీష్మించుకు కూర్చుని, పట్టువీడని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేసి తరలించారు. ఈ ఉదయం ఆయన్ను నిలువరించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు విఫలంకాగా, తన వాహనంలో, కార్యకర్తలు వెంటరాగా, శివార్ల వరకూ కన్నా చేరుకున్నారు.

అప్పటికే నగరం నుంచి పల్నాడు వైపు దారితీసే నరసరావుపేట, సత్తెనపల్లి రహదారులను దిగ్బంధించిన పోలీసులు, కన్నాను అరెస్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, తిరిగి నగరంలోకి తీసుకెళ్లారు. తమ నాయకుడి అరెస్ట్ అప్రజాస్వామికమంటూ, బీజేపీ శ్రేణులు ఘటనా స్థలిలోనే నిరసనకు దిగగా, పోలీసులు వారిని చెదరగొట్టారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా, ఎవరు సభలను నిర్వహించాలని చూసినా, ఊరుకోబోమని ఈ సందర్భంగా పోలీసు అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.

Tags: Kanna, Guntur, BJP Meeting, Gurajala