gannavaram tdp mla, chandrababu naidu, tdp vs ysrcp party, vallabaneni

వల్లభనేని వంశీ వ్యవహారంపై చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కావడంలేదు. తాజాగా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే గత కొద్ది రోజులుగా వంశీ పార్టీ మారుతున్నారని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన రాజీనామా గురుంచి టీడీపీ అధినేత చంద్రబాబుకు వంశీ లేఖ కూడా రాశాడు. అయితే వంశీతో మాట్లాడి సర్ధి చెప్పాలని ఇద్దరు టీడీపీ ముఖ్య నేతలకు చంద్రబాబు బాధ్యతలు అప్పచెప్పినా అవి ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పాలి.

అయితే తాజాగా కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో వంశీ వ్యవహారంపై మాట్లాడిన చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వ వేధింపులపై పోరాటం చేయాలని, కావాలనే వంశీపై తప్పుడు కేసులు పెట్టారని వంశీ ఏం నేరం చేశాడని కేసు పెట్టారంటూ ప్రశ్నించారు. వంశీపై కేసు పెట్టడం కాదు ఎమ్మార్వో, ఎస్సైని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చింతమనేని, అచ్చెన్నాయుడు, యరపతినేని, కూన రవిలపై అక్రమ కేసులు పెట్టారని, సొంత బాబాయ్ వివేకా హత్య కేసు, కోడి కత్తి కేసు ఎందుకు తేల్చడంలేదో సమాధానం చెప్పాలని అన్నారు. అంతేకాదు టీడీపీ చేసిన అభివృద్ది పనులన్నీ వైసీపీ రివర్స్ చేస్తుందని జగన్ చేస్తున్నది రివర్స్‌ టెండరింగ్‌ కాదని అది రిజర్వ్ టెండరింగ్‌ అంటూ విమర్శలు గుప్పించారు.

Tags: gannavaram tdp mla, chandrababu naidu, tdp vs ysrcp party, vallabhaneni vamshi