తెలంగాణలో డిపాజిట్టు కోల్పోయిన ప్రముఖులు వీరే

తెలంగాణలో డిపాజిట్టు కోల్పోయిన ప్రముఖులు వీరే

  • బరిలోకి దిగిన 1821 మంది అభ్యర్థులు
  • డిపాజిట్లు కోల్పోయిన వారి సంఖ్య 1515
  • డిపాజిట్ రాని అభ్యర్థుల్లో బాబూమోహన్, ప్రభాకర్, గుండా మల్లేశ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో 119 నియోజకవర్గాల్లో మొత్తం 1821 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. వీరిలో ఏకంగా 1515 మంది తమ డిపాజిట్లను కోల్పోయారు. 30కి పైగా స్థానాల్లో బీజేపీకి డిపాజిట్ దక్కలేదు. ఘన విజయం సాధించిన టీఆర్ఎస్ కూడా నాలుగు చోట్ల డిపాజిట్ కోల్పోవడం గమనార్హం. టీజేఎస్ కు సిద్ధిపేట, అంబర్ పేట, మల్కాజ్ గిరి, ఆసిఫాబాద్, దుబ్బాకలలో డిపాజిట్ దక్కలేదు. డిపాజిట్ కోల్పోయిన ప్రముఖుల్లో బీజేపీ అభ్యర్థులు బాబూమోహన్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీపీఐ అభ్యర్థి గుండా మల్లేశ్ లు ఉన్నారు.
Tags: deposits votes, tyelangana elections, elections 2018, trs party