Daggubati, Suresh Babu, Venkatesh, IT Raids, ramanaidu studio

దగ్గుబాటి సురేశ్ బాబు, వెంకటేశ్ ఇంటిపైనా ఐటీ దాడులు!

ఈ ఉదయం నుంచి దాడులు
సినిమాలు, కలెక్షన్స్ పై వివరాల సేకరణ
దాడుల్లో పాల్గొన్న 60 మందికి పైగా అధికారులు
గత నాలుగేళ్లుగా ఆదాయ, వ్యయాల్లో తప్పుడు లెక్కలు చూపుతున్నారన్న కారణంతో ఈ ఉదయం రామానాయుడు స్టూడియోస్ పై ఐటీ దాడులకు వచ్చిన అధికారులు, కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్ లోని దగ్గుబాటి సురేశ్ బాబు, హీరో వెంకటేశ్ ఇళ్లలోనూ తనిఖీలు ప్రారంభించారు. సురేశ్ ప్రొడక్షన్స్ తీసిన సినిమాలు, వాటికి వచ్చిన కలెక్షన్స్ తదితర వివరాలను వీరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. మరోవైపు సురేశ్ ప్రొడక్షన్స్ కార్యాలయంలోనూ అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. దాదాపు 60 మందికి పైగా ఐటీ విభాగం అధికారులు, సిబ్బంది ఈ తనిఖీలను జరుపుతున్నారని తెలుస్తోంది.
Tags: Daggubati, Suresh Babu, Venkatesh, IT Raids, ramanaidu studio