ఈ నెల 24న సమావేశం కానున్న ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్!

  • గోదావరి నీటిని కృష్ణా బేసిన్ కు తరలించడంపై చర్చ
  • నివేదికలు సమర్పించిన ఇరురాష్ట్రాల ఇంజనీర్లు
  • ప్రగతిభవన్ లో జరగనున్న భేటీ

గోదావరి నది నీటిని కృష్ణా బేసిన్ కు తరలించే విషయమై చర్చించేందుకు ఏపీ ముఖ్యమంత్రి జగన్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఈ విషయమై ఇప్పటికే జగన్, కేసీఆర్ ఓ అంగీకారానికి వచ్చారు. ఈ విషయంలో అధ్యయనం చేసేందుకు ఇరురాష్ట్రాల్లో ఇంజనీర్లతో అధ్యయన కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అయితే ఈ నివేదికలు అందినప్పటికీ ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమయ్యేందుకు కుదరలేదు.

ఈ నేపథ్యంలో ప్రగతిభవన్ లో ఈ నెల 24న ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశం కావాలని నిర్ణయించారు.  ఈ విషయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. ఈ భేటీలో ఇరురాష్ట్రాల ఇంజనీరింగ్ అధికారులు కూడా పాల్గొననున్నారు.