adusumilli jayaprakash rao

చంద్రబాబు అపహాస్యం చేస్తున్న ప్రజాస్వామ్యం

ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలు, విలువలు గురించి చంద్రబాబు నాయుడు ఇటీవల కాలంలో పదే పదే ప్రస్తావిస్తున్నాడు. ముఖ్యంగా తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ఎన్‌.డి.ఎ. నుండి బయటకు వాచినప్పటి నుండి, ప్రధాని నరేంద్రమోడీని వ్యక్తిగత శత్రువుగా భావిస్తూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రకటనలు, ఇస్తున్న వివరణలు హశ్యస్పపధంగా తయారయ్యాయి. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బ్రష్టుపటిస్తున్న వ్యక్తి చంద్రబాబు. స్థానిక సంస్థలను నిర్విర్యం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన హయంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపలేదు. కోర్టులు నిర్వహించాలని ఉత్తర్వులు ఇచ్చినా ఏదో ఒక సాంకేతిక సాకుతో మున్సిపల్‌, పంచాయితీ ఎన్నికలను వాయిదా వేస్తున్న ముఖ్యమంత్రి, స్థానిక సంస్థలు ప్రజాస్వామ్యాన్ని మూలాలు. అవి బలంగా వుండాలి, స్థానిక స్వపరిపాలన, సుపరిపాలన జరగాలన్న ఉద్దేశ్యంతోనే రాజ్యాంగాన్ని సవరించి వాటిని బలపరిచే వ్యవస్థ రూపొందించాడు నాటి ప్రధాని రాజీవ్‌గాంధి. కాని చంద్రబాబు నాయుడు తన హయంలో స్థానిక సంస్థలను అణగదొక్కి రాజ్యాంగ స్ఫూర్తికే విఘాతం కలిగిస్తున్నాడు.

పంచాయితీలకు హక్కులు లేవు. పంచాయితీ అధ్యక్షులనే వారు లేరు. ఇతర పార్టీలు గెలుస్తాయన్న భయంతో ఎన్నికలే లేవు. తన పార్టీ మనుషులకు నామినేటెడ్‌ పద్ధతిలో అధికారం కట్టబెట్టేందుకు జన్మభూమి కమిటిలను నియమించాడు. దీనిని పూర్తిగా పార్టీ వ్యవహారంగా మలిచి పంచాయితీ వ్యవస్థ స్ఫూర్తిని తుంగలో తొక్కాడు. ఇప్పుడు పెత్తనం జన్మభూమి కమీటిలది. వీరికి ప్రజల మద్దతు లేదు. ప్రజలు ఎన్నుకున్న వారు కాదు. పచ్చచొక్కాలు ధరించుటమే అవుతుంది. తన పార్టీ మనుషుల చేత, తన పార్టీ కార్యకర్తల కోసం, తన పార్టీ నేతల ద్వారా నడిచే వ్యవస్థగా పంచాయితీ వ్యవస్థలకు కొత్త అర్ధం తీసుకువచ్చాడు చంద్రబాబు నాయుడు. మునిసిపాలిటిలలో అయినా మరెక్కడైనా ఎన్నుకున్న ప్రతినిధుల పదవీకాలం ముగిస్తే అక్కడ పెత్తనం స్పెషల్‌ ఆఫీసర్స్‌దే. ఇటువంటి అప్రజాస్వామిక పద్ధతిలో రాష్ట్రాన్ని నిర్వహిస్తూ జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థల గురించి చంద్రబాబు నాయుడు ప్రసంగాలు చెయ్యటమంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చెయ్యడమే.

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్‌.ఎల్‌.ఎ.లకు విలువ లేదు. ప్రజాస్వామ్యంలో వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను ప్రజలు ఎన్నుకుoటారు. వారి వారి పని తీరునుబట్టి  తమ ప్రతినిధులకు ఓటు వేస్తారు. వారి పదవీ కాలమైన ఐదు సంవత్సరాలు ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా అక్కడి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, పర్యవేక్షించుటం ఆ ఎమ్‌.ఎల్‌.ఎ. హక్కు, బాధ్యత కూడా. అయితే చంద్రబాబు నాయుడికి ప్రజాతీర్పు అంటే గౌరవం లేదు. అందుకే ఎమ్‌.ఎల్‌.ఎ. లంటే పూచికపుల్లతో సమానం. ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ ఎమ్‌.ఎల్‌.ఎ. లంటే అస్సలు గిట్టదు. అందుకే ఆయన ప్రభుత్వ హయంలో తరచుగా ప్రోకాల్‌ వివాదాలు తరచుగా తలెత్తుతుoటాయి. స్థానిక ఎమ్‌.ఎల్‌.ఎ.లకు ఆహ్వానాలు లేకుండా అధికారిక కార్యక్రమాలు జరుగుతాయి. స్థానిక ఎమ్‌.ఎల్‌.ఎ.కి సముచిత స్థానం వేదికమీద ఉండదు. ప్రభుత్వ కార్యక్రమాలలో ఎమ్‌.ఎల్‌.ఎ.లు గళం విప్పేందుకు వీలుండదు. ముఖ్యమంత్రి పాల్గొన్న సభలోనే ఎమ్‌.ఎల్‌.ఎ.లకు మైకు నివ్వని సందర్భాలు అనేకం. ప్రతిపక్ష పార్టీ ఎమ్‌.ఎల్‌.ఎ. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకుడదో కూడా చంద్రబాబే నిర్ణయించాలనుకుoటాడు. అందుకే చంద్రబాబు పాల్గొనే సభలకు ప్రతిపక్ష ఎమ్‌.ఎల్‌.ఎ.లు బహిష్కరించాల్సిన పరిస్థితి.

ప్రతిపక్ష పార్టీల ఎమ్‌.ఎల్‌.ఎ.లను కాదని, వారి చేతిలో ఓడిపోయిన అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను అందలం ఎక్కించే ఒక చిత్రమైన సంస్కృతిని చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో ఆరంభించాడు. ఇది ఏమి ప్రజాస్వామ్య సూత్రమో అర్ధం కాదు. ఆయా నియోజకవర్గాలలో ఓడిపోయిన టి.డి.పి. అభ్యర్ధులకు అభివృద్ధి కార్యక్రమాలను నామిటెడ్‌ చేసేందుకు వీలుగా జి.వో. వెలువడింది. నిధుల ఖర్చు వారిద్వారా జరుగుచున్నది. ఇదీ చంద్రబాబు జమానాలో వున్న ప్రజాస్వామ్య విలువ.
ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎన్నికల గుర్తుమీద గెలిచిన వారు ఆ పార్టీకి కట్టుబడి ఉండాలి. పార్టీలు ఫిరాయించకూడదు. పార్టీ ఫిరాయిస్తే పదవి పోతుంది. ఇది చట్టం చెపుతున్న విషయం. కాని ఆ ప్రజాస్వామిక చట్టం చంద్రబాబుకు పట్టదు. 26 మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్‌.ఎల్‌.ఎ.లను పార్టీ ఫిరాయించేలా ప్రోత్సహించి అధికార పక్షంలో కలుపుకున్నాడు. ఆ ఎమ్‌.ఎల్‌.ఎ.లను అనర్హులుగా ప్రకించాలని చేసిన ఫిర్యాదుకు మూడేళ్ళుగా దిక్కులేదు. ఫిరాయింపుదారుల మీద ఎటువంటి చర్య తీసుకోని స్పీకర్‌ ప్రజాస్వామ్య రక్షకుడు ఎలా అవుతాడో! అటువoటి వ్యక్తి అధ్యక్షతన నడిచే సభకు వుండే గౌరవం, విలువ ఏ పాటిదో ప్రజలు అర్ధం చేసుకోవచ్చు. ఫిరాయింపు చట్టం ఆంధ్రప్రదేశ్‌కి వర్తించదా! ఫిరాయింపులు స్పీకర్‌కి కనిపించవా! ఇదేనా ప్రజాస్వామ్యం? పైగా ఫిరాయింపుదారులలో నలుగురికి తన మంత్రివర్గంలో సభ్యులుగా చేసిన ఘనత చంద్రబాబుది. ఇది మరే రాష్ట్రంలో జరగని అప్రజాస్వామిక చర్య. అయినా చంద్రబాబు ప్రజాస్వామ్య వ్యవస్థల మీద లెక్షర్లు దంచుతుoటారు.

ప్రజాస్వామ్యమంటే తాను ప్రశ్నించటమేనన్న గట్టి నమ్మకం చంద్రబాబు నాయుడిది. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించటమే కాదు సమాధానం చెప్పటం కూడా భాగమని చంద్రబాబుకు తెలియదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు పలు ప్రశ్నలు లేవనెత్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు చేసిన పలు అప్రజాస్వామిక నిర్ణయాల గురించి వారికి తెలుసు. అధికారులుగా వున్నప్పుడు వాిని ప్రశ్నించిన నిజాయితీ పరులు వారు. అధికారులుగా రిటైర్‌ అయినా ప్రజాసంక్షేమం మీద కాంక్ష కలిగిన ఆ అధికారులు నేడు బహిరంగ వేదికల మీద ప్రశ్నిస్తున్నారు. ఆ అధికారుల నిజాయితీని చంద్రబాబు కూడా శంకించలేనిది. అందుకే ఆ ఐ.ఎ.ఎస్‌. అధికారులు చెపుతున్న విషయాలను ప్రజలు నమ్ముతున్నారు. వారు లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతున్నారు.

చంద్రబాబు హయంలో అవినీతి వ్యవస్తే ప్రణమిల్లుతున్నదని ఆ మాజీ ఐ.ఎ.ఎస్‌.లు చెపుతున్న విషయం. ప్రభుత్వ జి.వో.లన్నీ ప్రైవేటు బేరసారాల తర్వాత విడుదలవుతున్నవే. కొందరు వ్యక్తులకు, ఇష్టులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటున్నది. అందులో విధానాలకు విలులేదు. తమ భుజం కాసే మీడియా సంస్థలకు అప్పనంగా కోట్లు అందించటం చంద్రబాబు ప్రభుత్వ స్పెషాలిటి. అది ఏ విధంగా జరిగిందో ఏ సంస్థకు అంతిమంగా లబ్ది చేకూరిందో మాజీ చీఫ్‌ స్పష్టంగా వివరించారు కూడా. ఆ లబ్ది పొందిన మొన్న తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశంకి అనుకూలంగా వార్తలను వండి వార్చిన వైనం అందరికి తెలిసిందే. మరో రాజకీయ ఊసరవెల్లి చెయ్యని సర్వేని చేసినట్టుగా నమ్మించేందుకు అనుకూలంగా ఆ సంస్థ టి.వి. ఛానల్‌లో ప్రత్యేక ఇంటర్వ్యూ ప్రసారం చేసిన వైనం కూడా అందరికి తెలుసు. చంద్రబాబు ప్రభుత్వం నుండి లభిస్తున్న ఆర్ధిక లబ్దికి ప్రతిగా ఆ వ్యక్తి చేతిలోని పబ్లిక్‌, టెలివిజన్‌ ఛానల్‌ తెలుగుదేశం బాగా ఎంత తీవ్రస్థాయిలో ఊదుతున్నది ఆంధ్రులు గమనిస్తున్నారు. ఒకనాటి గొప్ప దినపత్రికను నేడు ఒక పార్టీ కరపత్రికగా తయారుచేసిన ఘనత ఆ వ్యక్తిది. అత్యవసర పరిస్థితి సమయంలో ఇందిరాగాంధీ వ్యక్తి జాడను నిరసించిన మహోన్నత వ్యక్తి నార్ల వెంకటేశ్వరరావు సారధ్యంలో నడిచిన ఆ పత్రికే ప్రస్తుతం చంద్రబాబు వ్యక్తి జాడలో చరిస్తున్నది. అది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక పబ్లిక్‌ పతనానికి పరాకాష్ట. ఇక ఆ వ్యక్తి ఆధ్వర్యంలో నడిచే ఛానల్‌, అందులో స్పష్టంగా కనిపించే పచ్చరంగు ఏ ప్రజాస్వామిక విలువలను కాపాడుతున్నాయో అర్ధం కాదు. ‘మహారాజు ఎటువoటి  తప్పు చేయడు’ అనే పాత ముతక సామెతను తు.చ. తప్పక నమ్మి, అనుసరించి, అమలు చేస్తున్న మీడియా సంస్థలు, చంద్రబాబు నాయుడు పాలనను భుజానికెత్తుకుని, ప్రజాస్వామ్యంలో ‘ఫోర్త్‌  ఎస్టేట్’ పాత్రను అపహాస్యం చేస్తున్న వైనం ఎ.పి.కి ప్రత్యేకం.

రిటైర్ట్‌ అధికారులు వేస్తున్న ప్రశ్నలకు చంద్రబాబు ఎందుకు సమాధానం చెప్పడు? ప్రజాస్వామ్యం గురించి అంతగా ప్రవచించే చంద్రబాబు ఏలినవారు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పటం ప్రజాస్వామిక అవసరం అని భావించటం లేదా! అమరావతిలో జరిగిన భూబాగోతం గురించి మాజీ ప్రధాన కార్యదర్శి ఐ.వి.ఆర్‌. కృష్ణారావు వివరించారు. అంచనాలను పెంచి అయిన వారికి కాంాక్టులు కట్టబెడుతున్న వైనం ఆయన సమగ్రంగా వివరించారు. పోలవరం ప్రాజెక్టులో చంద్రబాబు పాత్ర ఏ మేరకో మరో ప్రధాన కార్యదర్శి అజయ్‌ కల్లాం కళ్ళకు కటినట్టు నిరూపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాధనం విచ్చలవిడిగా తినేస్తున్న వైనం ప్రతి పౌరుడికి తెలుసు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో వుందని ఒకవైపు చెపుతూ మరోవైపు పత్యేక విమానాలలో రాజకీయ పర్యటనలు చంద్రబాబు చేస్తున్న విషయం ఎవరికి తెలియదు. హెలికాఫ్టర్‌ తప్పించి మరో పద్ధతిలో ప్రయాణం చెయ్యని చంద్రబాబు దానికి అవసరమైన నిధులు ఎక్కడివో ప్రజాస్వామ్యవాదులు అడిగినపుడు చెప్పాలి కదా!
చంద్రబాబు చేసిన విదేశీ పర్యటనలు, దానికి అయిన ఖర్చు, ప్రధాని కూడా వాడని తరహాలో ప్రత్యేక విమానాలు వాడి సింగపూర్‌కి ఏమి తరలించారో ప్రజలకు చెప్పాలి కదా! సింగపూర్‌ నుండి ఏమి తెచ్చారా! ఎలా హవాలా రాకెట్లు నడుపుతున్నారో ప్రజలు గమనించటం లేదనుకోకండి. ప్రజాస్వామ్యమంటే పారదర్శకత కూడా. అది పూర్తిగా కరువైంది ఆంధ్రప్రదేశ్‌లో. అధికారం అడ్డం పెట్టుకుని అయినవారికి భూములు కట్టబెట్టమని ఏ ప్రజాస్వామ్య సూత్రం చెబుతోంది! ఒక సామాజిక వర్గానికే పదవులు కట్టబెట్టడం ఎటువిం ప్రజాస్వామ్యం. ప్రశ్నించాలి… సమాధానం చెప్పాలి… అది ప్రజాస్వామ్యం. ఆ మౌలిక సూత్రం అర్ధం చేసుకుని చంద్రబాబు ప్రజాప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి వుంది.