CAA,Union Minister,Telangana,Mukhtar Abbas Naqvi

ఆ అధికారం రాష్ట్రాలకు లేదు: కేంద్రమంత్రి నక్వీ

Share This

తెలంగాణలో సీఏఏను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు
పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అడ్డుకునే హక్కు రాష్ట్రాలకు లేదు
ముస్లింలకు ఇది పూర్తి సురక్షితం

పౌరసత్వ సవరణ చట్టాన్ని (సీఏఏ)ను అమలు చేయబోమని చెప్పే అధికారం రాష్ట్రాలకు లేదని కేంద్రమంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తేల్చిచెప్పారు. ఎవరు ఎన్ని ఆందోళనలు చేసినా దానిని అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఒకసారి పార్లమెంటు ఆమోదించిన చట్టాన్ని అమలు చేయబోమని చెప్పే అధికారం రాష్ట్రాలకు లేదన్నారు. ఈ చట్టం భారత్‌లోని ముస్లింలకు కూడా పూర్తి రక్షణగా ఉంటుందన్నారు. తెలంగాణలో ఈ చట్టాన్ని అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్‌లలో అణచివేతకు గురైన మైనారిటీలకు ఆదుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చినట్టు కేంద్రమంత్రి చెప్పారు. కాబట్టి ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు.
Tags: CAA,Union Minister,Telangana,Mukhtar Abbas Naqvi

Leave a Reply