bandla ganesh Congress Spokesperson

పవన్‌కళ్యాణ్‌ని నమ్ముకుంటే పనయ్యేదేమో

బండ్ల గణేష్‌ ఇప్పుడు సోషల్‌ మీడియా ట్రోలర్స్‌కి మేత అయిపోయాడు. కాంగ్రెస్‌ పార్టీలో చేరింది లగాయతు తన ఇంటర్వ్యూల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌ ద్వారా ‘లాఫింగ్‌ స్టాక్‌’గా మారిన గణేష్‌కి చివరకు ‘అధ్యక్షా’ అని అసెంబ్లీలో అనే అవకాశాన్ని కాంగ్రెస్‌ ఇవ్వలేదు. ఈసారి ఎన్నికల్లో అతడికి ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వకపోగా, పార్టీ స్పోక్స్‌ పర్సన్‌గా మాత్రం నియమించింది. అంటే టీవీ ఇంటర్వ్యూలు ఇస్తోన్న బండ్ల ఇకపై అదే పని అధికారికంగా చేసుకోవచ్చు. ఇన్ని రోజులు చేసిన హడావిడికి అతడిని ఈ పదవితో సరిపుచ్చడంతో మళ్లీ బండ్ల గణేష్‌ సోషల్‌ మీడియా ట్రోలర్స్‌కి పని కల్పించాడు.

పవన్‌కళ్యాణ్‌ చుట్టూ తిరిగిన గణేష్‌ అక్కడ పని జరగదేమోనని కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు. తీరా వాళ్లేమో ఎమ్మెల్యే కలకి కామా పెట్టేసి ముందు మిగతా పనులు చూడమన్నారు. తనకి దైవంగా చెప్పుకునే పవన్‌ కళ్యాణ్‌ గురించి మాట్లాడ్డానికి గానీ, తద్వారా పవన్‌ ఫాన్స్‌ని ఆకట్టుకోవడానికి గానీ ఇప్పుడు బండ్ల గణేష్‌కి ఛాన్స్‌ లేదు. కనీసం జనసేనని అంటిపెట్టుకుని వున్నా అతడికి పవన్‌ విశ్వాసిగా ఫాన్స్‌ అండదండలు వుండేవి. నమ్మకస్తుడిగా వెంటే వుంటే పవన్‌ తనకి ఎక్కడో చోట టికెట్‌ కూడా ఇచ్చి వుండేవాడేమో. ఏదో ఆశించి వెళితే ఇంకేదో చేతికి వచ్చినట్టయింది ఇప్పుడు బండ్లన్న పరిస్థితి.

Tags: bandla ganesh, Congress Spokesperson, pawan kalyan