AP-GOVT

శాసనమండలిలో 6 బిల్లులు ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుకు ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ సంస్కృతిక మరియు వారసత్వపు బోర్డు చట్టం సవరణ బిల్లు ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ దిశ చట్టం – క్రిమినల్ శాసన చట్టం 2019 బిల్లుకు ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ దిశ చట్టం- మహిళలు మరియు బాలికలపై నిర్దేశిత అపరాధముల కొరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రత్యేక న్యాయస్థానం చట్టం 2019 బిల్లు ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ ధార్మిక మరియు హిందూ మత సంస్థల మరియు ఎండోమెంట్ చట్టం సవరణ బిల్లుకు ఆమోదం

ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్య క్రమబద్ధీకరణ మరియు పర్యవేక్షణ కమిషన్ చట్టం సవరణ బిల్లుకు ఆమోదం

*శాసనమండలి లో అమరావతి పై స్వల్ప కాలిక చర్చ*

*మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ కామెంట్స్*

రాజధాని విషయం లో తెలుగుదేశం సభ్యుల మాటల్లో వారు దోచుకున్నది, ఆక్రమించుకున్నది ఏమై పోతుందోనన్న భయం వారిలో కనబడుతోంది

మా ప్రభుత్వం బలహీనవర్గాలకు అముచిత స్ధానం ఇస్తుంది

రాజధాని భూముల కోసం ల్యాండ్ పూలింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు…

అప్పుడు pot యాక్ట్, అసైన్డ్ భూముల చట్టాన్ని చంద్రబాబు ప్రభుత్వం అతిక్రమించింది

చట్టం ప్రకారం అసైన్డ్ భూములు కొనుగోలు చేయకూడదు …కాని రాజధాని ముసుగులో అసైన్డ్ భూములు కొనుగోలు జరిగాయి

ఎంక్వైరీ జరుగుతుంది.ఎవరెవరు కొన్నారో రేపు ఇంటి పేర్లతో సహా చెబుతా

మొదట్లో CRDA పరిధి 217 కిలో మీటర్లుగా నిర్ణయించారు

చంద్రబాబు వియ్యంకుడి వియ్యంకుడి కోసం ఆ పరిధిని పెంచారు

498 ఎకరాలను ఎకరం లక్ష‌చొప్పున ఆ వియ్యంకుడికి కేటాయించారు

ఆయన ఏ సామాజిక వర్గమో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ చెప్పాలి

అసైన్డ్ భూముల కొనుగోళ్ళను క్యాన్సల్ చేసేందుకు క్యాబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం

శివరామ క్రిష్ణ కమిటీ విజయవాడ, గుంటూరు మధ్య అతిసారవంతమైన భూములున్నాయని తెలిపింది

ఈ ప్రాంతం రాజధానికి అనువైంది కాదని తెలిపింది

అతిసారవంత మైన ఈ నేలలోరాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బందులుంటాయని తెలిపింది

తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణం కోసం 102 అడుగులు పిల్లర్లు వేశారు

దీనివలన ఖర్చు పెరిగింది..

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, రాజధాని కోసం జిఎన్ రావు కమిటీ వేసింది…..రిపోర్టును పరిశీలిస్తాం