AP IT Raid Updates

AP IT Raid Updates: విజయవాడ చుట్టుపక్కల ఐటీ దాడులు జరుగుతున్న కంపెనీల వివరాలు!

  • దాడుల్లో పాలు పంచుకుంటున్న 15 బృందాలు
  • నిర్మాణ రంగ కంపెనీల్లో అధికారుల సోదాలు
  • భూ లావాదేవీలపై ఆరా

విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోని పలు నిర్మాణ రంగ కంపెనీల్లో ఈ ఉదయం నుంచి ఆదాయపు పన్ను శాఖల అధికారులు సోదాలు జరుపుతున్నారు. దాదాపు 15 బృందాలు వివిధ ప్రాంతాల్లో రైడ్స్ చేస్తున్నాయి. సదరన్ కన్ స్ట్రక్షన్స్ కార్యాలయాల్లో, దాని అనుబంధ సంస్థగా రిజిస్టర్ అయిన సదరన్ డెవలపర్స్, బీఎంఆర్ గ్రూప్ ఆఫీసుల్లో, బీఎంఆర్ హేచరీస్, విజయవాడ, గుంటూరులోని వీఎస్ లాజిస్టిక్స్ కంపెనీలపై దాడులకు దిగారు. భారీ ఎత్తున పోలీసు బృందాలతో చేరుకున్న ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆయా కార్యాలయాల్లో ఇటీవల జరిగిన భూ లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.