AP cabinet meeting details

ఆంధ్రప్రదేశ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు ఇవే.

అమరావతి: ఏపి సిఎం అధ్యక్షతన ఈరోజు ఏపి కేబినెట్‌ సమావేశం జరిగింది. ఈ సమావేంలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకుంది. ఏపి కేబినెట్‌ నిర్ణయాలు.

•కేంద్రం నెరవేర్చని హామీలను రాష్ట్రమే చేపట్టాలని..234567
•రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ ఏర్పాటుకు కేబినెట్‌ నిర్ణయం
•నెల రోజుల్లో కడప స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన..
•ప్రైవేట్ సంస్థలతో కలిసి ప్రభుత్వ జాయింట్ వెంచర్ దిశగా ప్రయత్నాలు.
•పీపీపీ మోడల్‌లో వైజాగ్‌ మెట్రో చేపట్టాలని నిర్ణయం
•రూ. 8,300 కోట్లతో 42 కిలోమీటర్ల మేర వైజాగ్ మెట్రో
•ప్రపంచంలోనే పీపీపీ మోడల్‌లో నిర్మితమవుతున్న. రెండో అతి పెద్ద మెట్రో రైల్ ప్రాజెక్టు వైజాగ్ మెట్రో, 4,200 కోట్ల రుణం ఇచ్చేందుకు కొరియా ప్రభుత్వం ముందుకొచ్చింది. •గాజువాకకొమ్మాది 30 కి.మీ, గురుద్వారా ఓల్డ్ పోస్టాఫీసు5.25 కి.మీ..
•తాటిచెట్లపాలెం వాల్తేరు మధ్య 6.5 కి.మీ మెట్రో రైలు
•అన్న క్యాంటీన్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఏర్పాటు
•గ్రామీణ ప్రాంతాల్లో 152 అన్న క్యాంటీన్ల ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ కేబినెట్ నిర్ణయాలు తీసుకుంది. కాగా రామాయపట్నం పోర్ట్ ఏర్పాటుపైనా కేబినెట్‌లో చర్చ జరిగింది.