anuemmanuel latest project updates

అనూ ఇమ్మానుయేల్ కి మరో ఆఫర్

* తాజాగా ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రంలో నటించిన అందాలతార అనూ ఇమ్మానుయేల్ తమిళంలో ఓ భారీ ఆఫర్ ను పొందింది. తాను హీరోగా నటిస్తూ తమిళ హీరో ధనుష్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో నాగార్జున కూడా ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా అనూ ఇమ్మానుయేల్ ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మరో హీరోయిన్ గా ఇప్పటికే అదితీరావును తీసుకున్నారు.
* ప్రస్తుతం ‘సైరా’ చిత్రంలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో నటించనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కాగా, ఈ చిత్రం షూటింగును వచ్చే మార్చి నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు.
* ఎనర్జిటిక్ హీరో రామ్, దుల్కర్ సల్మాన్ కలసి ఓ చిత్రంలో నటించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వచ్చిన హిట్ చిత్రం ‘ఆర్ఎక్స్ 100’ దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో రామ్ హీరోగా స్రవంతి రవికిషోర్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ఓ కీలకమైన పాత్రకు దుల్కర్ ను సంప్రదిస్తున్నారట.