Abcari Policy, Price Increased, 20 Percent

తెలంగాణలో మద్యం ధరలకు రెక్కలు

  • కొత్తపాలసీ అమల్లోకి రావడంతో సర్కారు నిర్ణయం
  • ఏపీ మార్గంలోనే కేసీఆర్‌ ప్రభుత్వం
  • ఖాళీ షాపులను ప్రభుత్వమే నడపాలని నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో మద్యం కొత్తపాలసీ అమల్లోకి రావడంతోపాటు ధరలకు కూడా త్వరలో రెక్కలు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన కొత్త పాలసీ ఈరోజు నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితికిగాను (2019-21) ఎక్సైజ్‌ శాఖ ఈ పాలసీని ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,216  దుకాణాలకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలో 19 డిపోల ద్వారా వీటికి మద్యం సరఫరాకు ఏర్పాట్లు చేసింది.

2021 అక్టోబరు 31 వరకు అమల్లో ఉన్న కొత్తపాలసీ ద్వారా ప్రభుత్వ ఖజానాకు 1467 కోట్ల రూపాయల భారీ ఆదాయం సమకూరింది. దీనికి అదనంగా మద్యం ధరలను కూడా పెంచి మరికొంత ఆదాయాన్ని రాబట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసింది.

ఇందుకుగాను ఇటీవల ఏపీ ప్రభుత్వం తన కొత్త మద్యం విధానంలో 15 నుంచి 20 శాతం ధరలు పెంచడంతో, అదే విధానాన్ని తాము కూడా ఆచరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. అలాగే, దుకాణాల నిర్వహణకు ఎవరూరాని చోట్ల ప్రభుత్వమే దుకాణాలు నడపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags: Abcari Policy, Price Increased, 20 Percent