50 రోజులు పూర్తి చేసుకున్న ‘రంగస్థలం’ .. చరణ్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రం

‘రంగస్థలం’తో చరణ్ కి దక్కిన భారీ విజయం
ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా గ్రాస్
120 కోట్లకి పైగా షేర్
చాలాకాలం నుంచి చరణ్ ఎదురుచూస్తోన్న బ్లాక్ బస్టర్ హిట్ ‘రంగస్థలం’తో దక్కింది. సమంత కథానాయికగా నటించిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను వసూళ్ల పరంగా దుమ్మురేపేసింది. దర్శకుడిగా సుకుమార్ ను ఈ సినిమా మరో మెట్టుపైన నుంచో బెట్టింది. అలా ఈ సినిమా ఇప్పటికీ కొన్ని థియేటర్స్ లో సందడి చేస్తూ 50 రోజులను పూర్తి చేసుకుంది.ఈ సినిమా తరువాత ‘భరత్ అనే నేను’ .. ‘నా పేరు సూర్య’ వంటి పెద్ద హీరోల సినిమాలు వచ్చినా, అవి ‘రంగస్థలం’ సినిమా వసూళ్లపై చూపించిన ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. వసూళ్ల పరంగా .. నటన పరంగా చరణ్ కెరియర్లోనే ఇది చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకి పైగా గ్రాస్ ను సాధించిన ఈ సినిమా, 120 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. కథ .. కథనాలు .. సంగీత సాహిత్యాలు .. చిత్రీకరణ ఈ సినిమాకి ప్రధానబలంగా నిలిచి, ఈ స్థాయి విజయాన్ని కట్టబెట్టాయి.