congress party,telangana 2018 election, contestents

27 నియోజవర్గాల్లో ఆస్తులు అమ్ముకున్న నేతలు

తెలంగాణ ఎన్నికల్లో నగదు కట్టలు తెంచుకుంది. అన్ని పార్టీలూ విచ్చలవిడిగా ఓటర్లకు డబ్బు పంపిణీ చేశాయి. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి పోలింగ్ ముగిసే వరకూ ధనప్రవాహం వెల్లువెత్తింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీకు చెందిన అభ్యర్థులు ఒక్కొక్కరు రూ.20 కోట్లపైగా ఖర్చుచేశారనేది బహిరంగ రహస్యమే!. వాస్తవానికి ఎన్నికల సంఘం నిబంధనలకు ప్రకారం… అభ్యర్థి ఖర్చు రూ.28 లక్షలకు మించరాదు. కానీ వీటిని అధిగమించి కోట్ల రూపాయల నగదు మంచినీళ్ల ప్రాయంలా ఖర్చుచేశారు. నగదు, మద్యంతో ఓటర్లను ప్రలోభానికి గురిచేయడంలో అన్ని పార్టీలూ ముందున్నాయి. నగదు పంపణీ కోసం అభ్యర్థులు ప్రత్యేకంగా వ్యక్తులను నియమించి పోలింగ్ ముందురోజు పంచిపెట్టాయి.

ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, హైదరాబాద్ నగరంలోని మురికివాడల్లో కరెన్సీ నోట్లు విపరీతంగా పంచారు. ఒక్కో ఓటుకు రూ.500 నుంచి 3,000 వరకు చెల్లించాగా, కొన్ని చోట్లు ఇది రూ.6,000 వరకు వెళ్లింది. కొన్ని చోట్ల కులాలు, సామాజిక వర్గాల వారిగా ఓటర్లను కొనుగోలు చేశారు. కొందరు అభ్యర్థులు ఎన్నికల కోసం తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా లభించిన ఆస్తులను సైతం అమ్ముకున్నట్టు తెలుస్తోంది. వీరిలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీలకు చెందిన వారూ ఉన్నారు. ఇక, నల్లగొండ, మునుగోడు, భువనగిరి, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కొడంగల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్‌నగర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మల్కాజ్‌గిరి, మహేశ్వరం, ఉప్పల్, ఎల్బీనగర్, అలేరు, రాజేంద్రనగర్, నాగరకర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి, ఖమ్మం నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖర్చు రూ.20 కోట్లు దాటిపోయింది.

అంతేకాదు, కేసీఆర్ బరిలో ఉన్న గజ్వేల్‌తో సహా మంత్రులు పోటీచేసిన నియోజకవర్గాల్లోనూ భారీగా నగదు పంపిణీ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లకు మూడు నుంచి నాలుగు రెట్లు అధిక మొత్తంలో డబ్బు అందజేశారు. ఇంటింటి ప్రచారం, ర్యాలీలు, రోడ్‌షోలు, సోషల్ మీడియాతో సహా మీడియాలో ప్రకటనలకు భారీగా నగదు ఖర్చుచేసినట్టు గుసగుసలాడుకుంటున్నారు.
Tags: congress party,telangana 2018 election, contestents