ఈ బూతు సేల్‌ అవుతుందా?

బూతు పోస్టర్లు, బూతు కంటెంట్‌ పెట్టి ‘యూత్‌’ సినిమా అంటూ బ్రాండ్‌ చేసి వదిలేస్తే కొన్ని చిత్రాలకి కాసులు బాగా రాలాయి. దీంతో అదే కోవలో క్యాష్‌ చేసుకోవడానికి చాలా మంది బయల్దేరారు. ఈమధ్య కాలంలో అలాంటి చిత్రాలు చాలానే వచ్చినా కానీ ఒకటీ అరా తప్ప సక్సెస్‌ కాలేదు. అయినప్పటికీ యువతని థియేటర్ల వరకు రాబట్టడానికి అడల్ట్‌ కంటెంట్‌నే వాడుతున్నారు పలువురు దర్శకులు. కమర్షియల్‌ సక్సెస్‌ కోసమని ‘మిణుగురులు’లాంటి ఉత్తమ చిత్రం తీసిన అయోధ్య కుమార్‌ కూడా ’24 కిస్సెస్‌’ అంటూ హాట్‌ కంటెంట్‌ని ప్రమోట్‌ చేస్తున్నాడు. ఈ చిత్రంలో ఉత్తమ విలువలు వున్నాయంటూ వాదిస్తూనే ప్రచారానికి మాత్రం ఆ ముద్దు సీన్లనే వాడుతున్నారు.

ఇప్పటికే రెండు ట్రెయిలర్లు కట్‌ చేసి యువతకి తమ సినిమాపై ఒక ఐడియా ఇచ్చిన ఈ చిత్ర బృందం కిస్సెస్‌ మేకింగ్‌ వీడియో అంటూ ఆ ముద్దు సీన్లని చిత్రీకరించినప్పటి దృశ్యాలని పెట్టి ఓ వీడియో వదిలారు. ఈ కంటెంట్‌ వీడియోలో వున్నపుడు ఈజీగా మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చేస్తాయి కానీ అవి కలక్షన్లుగా కన్వర్ట్‌ అవుతాయా లేదా అనేదే అనుమానం. ఈమధ్య వచ్చిన చాలా చిత్రాల ట్రెయిలర్స్‌ని ఎగబడి చూసి, సినిమా వస్తే థియేటర్ల ఛాయలకి కూడా వెళ్లలేదు జనం. అందుకే ఇది కలక్షన్లు రాబట్టుకుంటుందా లేదా అనే డౌట్‌తో ఇంకా ఇంకా వీడియోలు వదులుతూ యూత్‌ని ఆకట్టుకోవడానికి బలంగా జరుగుతోంది ప్రయత్నం.

Tags: 24 kisses, movie ,review and rating, hebah patil 24kisses