24 నిమిషాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేస్తా!: రామ్ గోపాల్ వర్మ

24 నిమిషాల్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల చేస్తా!: రామ్ గోపాల్ వర్మ

టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జీవితంపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను తెరెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్స్ ను ఎప్పటికిప్పుడు రిలీజ్ చేస్తూ సినిమా వేడి తగ్గకుండా వర్మ చూసుకుంటున్నారు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ రిలీజ్ విషయమై వర్మ స్పందించారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ సినిమా రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన వచ్చిన 24 నిమిషాల్లోనే తాను లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైలర్ ను విడుదల చేస్తానని వర్మ తెలిపారు.

ఇలా చేయాలని ఎన్టీఆర్ తనను స్వర్గం నుంచి హెచ్చరించారన్నారు. ఆయన కుమారుడు తీసిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాకు ఎన్టీఆర్ ఆశీస్సులు లభించలేదని స్పష్టమయిందని వర్మ అన్నారు. ఎన్టీఆర్ కేవలం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాను మాత్రమే ఆశీర్వదించబోతున్నారని వ్యాఖ్యానించారు. లక్ష్మీస్ ఎన్టీఆర్-మహానాయకుడు సినిమాలు ముఖాముఖి తలపడతాయని జోస్యం చెప్పారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్ లో స్పందించారు.