23 భాషలలో 'పీఎమ్ నరేంద్ర మోదీ' ఫస్టులుక్ రిలీజ్

23 భాషలలో ‘పీఎమ్ నరేంద్ర మోదీ’ ఫస్టులుక్ రిలీజ్

తెరపైకి ‘నరేంద్ర మోదీ’ బయోపిక్
దర్శకుడిగా ఒమంగ్ కుమార్
వివేక్ ఒబెరాయ్ బలమైన నమ్మకం
తెలుగు .. హిందీ భాషల్లో ఇప్పుడు బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఈ క్రమంలోనే భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ జీవితచరిత్రను తెరపైకి తీసుకురావడానికి బాలీవుడ్లో సన్నాహాలు మొదలైపోయాయి. నరేంద్ర మోదీ బాల్యం .. విద్యాభ్యాసం .. రాజకీయ ప్రవేశం .. అంచలంచెలుగా ఎదిగిన తీరు ఈ బయోపిక్ లో చూపించనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రధాన పాత్రధారిగా కనిపించనున్న ఈ సినిమాకి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించనున్నాడు.

ఈ బయోపిక్ కి ‘పీఎమ్ నరేంద్ర మోదీ’ అనే టైటిల్ ను రీసెంట్ గా ఖరారు చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టులుక్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ ఫస్టులుక్ పోస్టర్ ను 23 భాషల్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లాంచ్ చేశారు. నరేంద్ర మోదీ లుక్ లో వివేక్ ఒబెరాయ్ బాగా కుదిరిపోయాడు. సురేశ్ ఒబెరాయ్ .. సందీప్ సింగ్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తన కెరియర్లోనే చెప్పుకోదగినదిగా ఈ సినిమా నిలిచిపోతుందని వివేక్ ఒబెరాయ్ బలంగా నమ్ముతున్నాడు.