దటీజ్ రజనీ… 20 గంటల్లో 3 కోట్లు దాటిన టీజర్ వ్యూస్!

  • నిన్న ఉదయం విడుదలైన ‘2.ఓ’ టీజర్
  • నెట్టింట సునామీని సృష్టించిన టీజర్
  • 50 లక్షలు దాటిన తెలుగు టీజర్ వ్యూస్

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ మేనియా ఎలా ఉంటుందో మరోసారి తెలిసొచ్చింది. నిన్న ఉదయం ‘2.ఓ’ టీజర్ విడుదల కాగా, ఇప్పుడది నెట్టింట సునామీ సృష్టిస్తోంది. కేవలం 9 గంటల వ్యవధిలో 1.40 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సినిమా, 20 గంటలకెల్లా 3 కోట్ల వ్యూస్ ను దాటింది. శంకర్ దర్శకత్వంలో రజనీ హీరోగా, అమీ జాక్సన్ హీరోయిన్ గా నటించిన చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ ఛాయలున్న పాత్రను పోషించాడు.

ఇక టీజర్ లో చూపించిన వీఎఫ్ఎక్స్ ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతున్నాయి. తెలుగు టీజర్ వ్యూస్ 50 లక్షలను దాటాయి. హిందీ, తమిళ భాషల్లో సైతం ‘2.ఓ’ టీజర్ దూసుకెళుతోంది. ఈ సినిమా గ్రాఫిక్స్ కోసమే రూ. 540 కోట్లు ఖర్చు కాగా, మొత్తం బడ్జెట్ రూ. 1000 కోట్లని అంచనా.