‘2.ఓ’ సినిమా నుంచి టీజర్ వచ్చేస్తోంది

400 కోట్ల బడ్జెట్ తో ‘2.ఓ’
నవంబర్ 29న సినిమా రిలీజ్
అభిమానుల్లో పెరుగుతోన్న అంచనాలు
రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలుగా ‘2.ఓ’ సినిమా రూపొందుతోంది. 400 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా నుంచి టీజర్ ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీన టీజర్ ను విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారు.

టీజర్ తోనే ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు పెరిగిపోయేలా ప్లాన్ చేశారని అంటున్నారు. అక్షయ్ కుమార్ తాజా చిత్రమైన ‘గోల్డ్’ ఈ నెల 15వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాతో ‘2.ఓ’ సినిమా టీజర్ ను అటాచ్ చేస్తున్నారట. దేశ వ్యాప్తంగా ‘గోల్డ్’ సినిమాతో పాటు ‘2.ఓ’ టీజర్ కూడా ప్రదర్శితం కానుంది. నవంబర్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమనే నమ్మకంతో రజనీ అభిమానులు వున్నారు.