135 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాల్లో టీడీపీదే గెలుపు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

135 అసెంబ్లీ, 18 ఎంపీ స్థానాల్లో టీడీపీదే గెలుపు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

Share This

చంద్రబాబు కష్టార్జితం వృథా కాదు
ప్రజలు టీడీపీకి పట్టం కట్టనున్నారు
కేంద్రం మితిమీరిన జోక్యంతో ఈసీ, టీడీపీకి అన్యాయం చేసింది
ఏపీలో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుపై ప్రధాన పార్టీలు టీడీపీ, వైసీపీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తిరిగి టీడీపీనే అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు సహా నేతలు చెబుతుంటే, జగన్ సీఎం కావడం ఖాయమని వైసీపీ నేతలు నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, 135 అసెంబ్లీ, 18 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ గెలుపు ఖాయమని అన్నారు.

కేంద్రం మితిమీరిన జోక్యంతో ఎన్నికల సంఘం, టీడీపీకి అన్యాయం చేసిందని అన్నారు. మోదీ, కేసీఆర్, జగన్ ఎన్ని కుట్రలు చేసినా చంద్రబాబును ఏమీ చేయలేరని, చంద్రబాబు కష్టార్జితం వృథా కాదని, ప్రజలు టీడీపీకి పట్టం కట్టనున్నారని అన్నారు. బెట్టింగ్ రాయుళ్లు వైసీపీ గెలుస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసి, అమాయకులను మోసం చేస్తున్నారని విమర్శించారు.