ప్రతిపక్ష నేతల తీరుపై నిప్పులు చెరిగిన కేసీఆర్

 

ప్రతిపక్ష నేతల తీరుపై నిప్పులు చెరిగిన కేసీఆర్

హైదరాబాద్: అనేక త్యాగాల మీద, అనేక పోరాటాల ఫలితంగా 6 దశాబ్దాల తర్వాత తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ రద్దు తర్వాత తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మాట్లాడారు. ఉద్యమ సమయంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా.. పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం 21.96 శాతం అభివృద్ధిని సాధించిందని చెప్పారు. కానీ ప్రతిపక్ష నేతలు మాత్రం కాకిగోల చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఏ పని చేసినా విపక్ష నేతలు అర్థం పర్థం లేని అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. దాదాపు 40 అవార్డులొచ్చాయని గుర్తుచేశారు.