10 dead 20 injured in rtc bus accident in kondagattu

Breaking: కొండ‌గ‌ట్టులో ఆర్టీసీ బస్సు బోల్తా.. 35 మంది మృతి

10 dead, 20 injured in RTC bus accident in kondagattu
జగిత్యాల: కొండగట్టు ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 35 మంది మృతి చెందగా.. మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులను జగిత్యాల ఆస్పత్రికి తరలిస్తున్నారు. స్థానికులు, అధికారులు, పోలీసు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో చిక్కుకున్న వారిని వెలికితీస్తున్నారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ సింధూ శర్మ, కలెక్టర్ శరత్ సంఘటనాస్థలానికి చేరకున్నారు. ప్రమాదంపై సీఎం కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణనష్టంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Tags: RTC Bus Accident ,Kondagattu ,jagithyala,10 died