10 మంది ఉపాధి హామీ కార్మికులు మృతి

మహబూబ్‌నగర్: నారాయణపేట జిల్లాలో 10 మంది ఉపాధి హామీ కార్మికులు మృతి చెందారు. ఉపాధి హామీ పనులు చేస్తుండగా మట్టి దిబ్బలు ఒక్కసారి కూలాయి. ఈ ప్రమాదంలో మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన మరికల్ మండలం తీలేరులో జరిగింది.  కాగా ఈ దుర్ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూలీల మరణం దురదృష్టకరమన్నారు. మృతులు కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా మంత్రిని, అధికారులను కేసీఆర్ ఆదేశించారు.