హ్యాక్ అయిన అమితాబ్ ట్విట్టర్ ఖాతా.. ఇమ్రాన్ ఫొటోతో ‘లవ్ పాకిస్థాన్’ పోస్టు

హ్యాక్ అయిన అమితాబ్ ట్విట్టర్ ఖాతా.. ఇమ్రాన్ ఫొటోతో ‘లవ్ పాకిస్థాన్’ పోస్టు

అమితాబ్ ఫొటో స్థానంలో ఇమ్రాన్ ఫొటోను పెట్టిన టర్కీ హ్యాకర్లు
ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింలపై దాడులు జరిగాయని పోస్టు
గతంలో షాహిద్ కపూర్ ట్విట్టర్ ఖాతా హ్యాక్
బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ట్విట్టర్ ఖాతా హ్యాక్ అయింది. సోమవారం టర్కీ హ్యాకర్లు అమితాబ్ ఖాతాను హ్యాక్ చేసి అందులో అమితాబ్ డిస్‌ప్లే ఫొటోను మార్చేశాడు. ఆ స్థానంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఫొటో పెట్టి ‘లవ్ పాకిస్థాన్’ అని పోస్టు పెట్టారు. రంజాన్ మాసంలోనూ భారత్‌లో ముస్లింలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు, పాకిస్థాన్, టర్కీ పతాకాలను పోస్టు చేశారు. కాగా, ఇటీవల మరో నటుడు షాహిద్ కపూర్ ట్విట్టర్ ఖాతా కూడా హ్యాక్‌కు గురైంది. ‘పద్మావత్’ సినిమాలో చూపించినట్టు టర్కీకి చెందిన అల్లావుద్దీన్ ఖిల్జీ ఆక్రమణదారుడు కాదని అందులో పేర్కొన్నారు.