హైదరాబాద్ లో బైక్ ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం!

హైదరాబాద్ లో బైక్ ను ఢీకొట్టిన లారీ.. ఇద్దరు దుర్మరణం!

లంగర్ హౌస్ రింగ్ రోడ్డు వద్ద ఘటన
భారీగా స్తంభించిన ట్రాఫిక్
కేసు నమోదుచేసిన పోలీసులు
తెలంగాణలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ లోని లంగర్ హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బైక్ ను వేగంగా వెళుతున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రింగ్ రోడ్డుపై ప్రమాదం చోటుచేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ఈ ప్రమాదంపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.