హైదరాబాదీలను థ్రిల్ చేసిన బీఎండబ్ల్యూ జాయ్ ఫెస్ట్!

హైదరాబాద్ లోని శంషాబాద్ లో జరిగిన బీఎండబ్ల్యూ జాయ్ ఫెస్ట్-2018 చూపరులను థ్రిల్ చేసింది. వరుసగా వస్తున్న లగ్జరీ కార్లు, ‘ఎక్స్ డ్రైవ్’, డ్రిఫ్టింగ్ వంటి ఫీట్స్ ను చేస్తుంటే చూస్తున్నావారు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. బీఎండబ్ల్యూ 6 సిరీస్ లోని గ్రాన్ తురిస్మో, సరికొత్త ఎం5 వాహనాలతో పాటు 5 సిరీస్, 7 సిరీస్, ఎక్స్3, ఎక్స్1, ఎక్స్5, మినీ వంటి లగ్జరీ కార్లను నడిపించిన నిష్ణాతులైన డ్రైవర్లు తమ డ్రైవింగ్ టెక్నిక్ లను ప్రదర్శించారు. ఫాస్ట్ లాప్స్, కార్నర్ బ్రేకింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ఫీట్లు చేశారు. ఈ తరహా ప్రదర్శనను హైదరాబాద్ లో నిర్వహించడం ఇదే తొలిసారని, దేశవ్యాప్తంగా మొత్తం 16 నగరాల్లో ఈ జాయ్ ఫెస్ట్ ను నిర్వహిస్తామని సంస్థ ప్రకటించింది.
Tags:hyderabad,x drive in hyd,drifting,#joy fest 2018