హరీశ్ రావుకు కేటీఆర్ ప్రత్యేక శుభాభినందనలు!

హరీశ్ రావుకు కేటీఆర్ ప్రత్యేక శుభాభినందనలు!

నేడు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న టీఆర్ఎస్ నేత, ఎమ్మెల్యే హరీశ్ రావుకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేక శుభాభినందనలు తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన కేటీఆర్, “గౌరవనీయ సిద్ధిపేట ఎమ్మెల్యే, డైనమిక్ లీడర్ హరీశ్ రావుకు నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు, శాంతి సౌఖ్యాలు కలగాలని, ప్రజాసేవలో మీరు మరింతకాలం గడపాలని కోరుకుంటున్నాను” అన్నారు.

కాగా, నేడు హరీశ్ రావు తన బర్త్ డేను నిరాడంబరంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. తాను నేడు సిద్ధిపేటలో లేదా హైదరాబాద్ లో ఉండబోవడం లేదని, అభిమానులు, కార్యకర్తలు అర్థం చేసుకోవాలని హరీశ్ రావు మూడు రోజుల క్రితమే కోరారు.