హరికృష్ణ భౌతికకాయానికి నివాళులర్పించిన సీఎం కేసీఆర్

  • మెహిదీపట్నంలోని నివాసంలో హరిక‌‌ృష్ణ భౌతికకాయం
  • హరికృష్ణ కుటుంబసభ్యులకు కేసీఆర్ పరామర్శ
  • కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం, మంత్రి జగదీశ్ రెడ్డి 

టీడీపీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ భౌతికకాయానికి తెలంగాణ సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. హైదరాబాద్ లోని మెహిదీపట్నంలో ఉన్న నివాసంలో హరిక‌‌ృష్ణ భౌతికకాయాన్ని కేసీఆర్ సందర్శించారు. నందమూరి కుటుంబసభ్యులను పరామర్శించిన కేసీఆర్.. వారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కాగా, కేసీఆర్ వెంట డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి జగదీశ్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, హరికృష్ణ నివాసం వద్దకు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు.